ఆడుకొంటున్న చిన్నారిపై నుండి వెళ్లిన కారు: ప్రాణాలతో బయటపడిన బాలుడు (వీడియో)

Published : Jan 14, 2021, 03:58 PM ISTUpdated : Jan 15, 2021, 10:27 AM IST
ఆడుకొంటున్న చిన్నారిపై నుండి వెళ్లిన కారు: ప్రాణాలతో బయటపడిన బాలుడు (వీడియో)

సారాంశం

 వాహనాలు నడిపే సమయంలో ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్న ప్రమాదాలు జరుగుతాయి. అపార్ట్ మెంట్ నుండి వాహనం బయటకు తీసే సమయంలో కూడ పలు ప్రమాదాలు చోటు చేసుకోవడం మరణాలు చోటు చేసుకొన్న ఘటనలు తెలంగాణలో చోటు చేసుకొన్నాయి. 

హైదరాబాద్: వాహనాలు నడిపే సమయంలో ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్న ప్రమాదాలు జరుగుతాయి. అపార్ట్ మెంట్ నుండి వాహనం బయటకు తీసే సమయంలో కూడ పలు ప్రమాదాలు చోటు చేసుకోవడం మరణాలు చోటు చేసుకొన్న ఘటనలు తెలంగాణలో చోటు చేసుకొన్నాయి. 

హైద్రాబాద్ లో ఓ డ్రైవర్  ఏమరుపాటుగా వాహనం నడిపాడు. దీంతో చిన్నారిపై నుండి వాహనం వెళ్లింది. వాహనం వెళ్లిన  కొద్దిసేపటికే ఆ చిన్నారి లేచి నడుచుకొంటూ వెళ్లిపోవడంతో అంతా ఊపిరి పీల్చుకొన్నారు.

రాజేంద్రనగర్ సమీపంలోని ఉప్పర్‌పల్లిలో గల ఓ అపార్ట్ మెంట్  గేట్ వద్ద పిల్లలు ఆడుకొంటున్నారు. అపార్ట్ మెంట్ నుండి కారు రోడ్డుపైకి తీసుకెళ్లాడు.

 

అపార్ట్ మెంట్ గేటు ముందు పిల్లలు ఆడుకొంటున్న విషయాన్ని గమనించని డ్రైవర్ వాహనాన్ని ముందుకు తీసుకెళ్లాడు. అదే సమయంలో గేటు ముందు చిన్నారి ఆడుకొన్న విషయాన్ని గమనించకుండా వాహనాన్ని అలానే ముందుకు పోనిచ్చాడు. వాహనం కింద పడిపోయిన చిన్నారి కొద్దిసేపటికి లేచి నడుచుకొంటూ ముందుకెళ్లింది.

ఈ దృశ్యాలు అపార్ట్ మెంట్ సీసీకెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ దృశ్యాలను సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ట్విట్టర్ లో పోస్టు చేశారు.  వాహనాలు నడుపుతున్న వారంతా జాగ్రత్తగా ఉండాలని ఆయన పోలీసులు కోరారు.

ఈ ఘటన ఉప్పర్ పల్లిలోని ఆశోక్ విహార్ ఫేజ్ -2 లో బుధవారం నాడు చోటు చేసుకొందని పోలీసులు ట్విట్టర్ లో పేర్కొన్నారు.

PREV
click me!

Recommended Stories

Hyderabad: న్యూ ఇయర్ వేళ మాదక ద్రవ్యాల మత్తు వదిలించే పాట.. ఆవిష్కరించిన వీసీ సజ్జనార్!
Kalvakuntla Kavitha: సీఎం రేవంత్ రెడ్డిపై రెచ్చిపోయిన కల్వకుంట్ల కవిత | Asianet News Telugu