బీజేపీలో మల్కాజ్‌గిరి టికెట్‌పై పోటీ!.. తెరపైకి కొత్త పేరు

By Mahesh KFirst Published Jan 23, 2024, 9:34 PM IST
Highlights

మల్కాజ్‌గిరి నుంచి పోటీ చేయడానికి ఇది వరకే ఈటల రాజేందర్ ఆసక్తి చూపిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా, తెరపైకి కొత్తగా మరోపేరు వచ్చింది. తెలంగాణ బీజేపీలో టికెట్ల పోటీ తీవ్రమవుతున్నట్టు తెలుస్తున్నది.
 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సీట్లను పెంచుకున్న బీజేపీ లోక్ సభ ఎన్నికలపై ఆశలు పెంచుకున్నది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన, పోటీ చేయని సీనియర్లు సైతం లోక్ సభ ఎన్నికల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ నాయకుల్లో గెలిచే అవకాశాలు ఉన్న స్థానాలపై పోటీ పెరుగుతున్నది. ఇటీవలే ఈటల రాజేందర్ మల్కాజ్‌గిరి నుంచి పోటీ చేయడానికి ఆసక్తి కనబరిచిన సంగతి తెలిసిందే. తాజాగా, ఈ సీటు నుంచి పోటీ పై కొత్త పేరు తెరపైకి వచ్చింది.

అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవ సందర్భంగా హైదరాబాద్‌లో కృష్ణ ధర్మ పరిషత్ ఆధ్వర్యంలో విజయ్ దివస్ నిర్వహించారు. మోడీ నాయకత్వం పట్ల ప్రజలలో ఆదరణ పెరుగుతున్నదని, తెలంగాణలోనూ బీజేపీకి సానుకూల వాతావరణం ఉన్నదని కృష్ణ ధర్మ పరిషత్ వ్యవస్థాపకుడు టీ అభిషేక్ గౌడ్ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం తెలంగాణ మొత్తం 17 స్థానాలకు గాను 12 సీట్లు గెలుచుకునే అవకాశాలు బీజేపీకి కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. యువతకు అవకాశం ఇస్తే.. పార్టీలోనూ జోష్ పెరుగుతుందని అన్నారు. మల్కాజ్‌గిరి నుంచి లోక్ సభకు పోటీ చేయడానికి పార్టీ నాయకుడు రామ్ యాదవ్‌కు అవకాశం ఇవ్వాలని కృష్ణ ధర్మ పరిషత్ వ్యవస్థాపకులు టీ అభిషేక్ గౌడ్.. బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ ఎంపీ కే లక్ష్మణ్‌కు విజ్ఞప్తి చేశారు. 

Latest Videos

Also Read : బెంగాల్‌లో కాంగ్రెస్‌కు కొత్త సమస్య.. దీదీపై సొంత పార్టీ నేతల విమర్శలు.. నష్ట నివారణకు రాహుల్ గాంధీ ప్రయత్నం

అభిషేక్ గౌడ్‌ను కే లక్ష్మణ్ అభినందించారు. రాముడిని తిరస్కరించిన పార్టీలు ముందుకు సాగలేవని, లౌకికవాదం ముసుగులో హిందువులను అగౌరవపరుస్తున్నాయని ఆరోపించారు. అయితే, అభిషేక్ గౌడ్ చేసిన విజ్ఞప్తిపై కే లక్ష్మణ్ బహిరంగంగా ఎలాంటి కామెంట్ చేయలేదు. బహుశా సమయం వచ్చినప్పుడు అధిష్టానం ముందు ప్రస్తావించే అవకాశం ఉన్నది. కాగా, ఇది వరకే తాను మల్కాజ్‌గిరి టికెట్ విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్టు ఈటల రాజేందర్ ఇటీవలే పేర్కొన్న సంగతి తెలిసిందే.

ఈ నెల 22వ తేదీన అయోధ్యలోని రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం నిర్వహించిన సంగతి తెలిసిందే. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిగింది. ఇందుకు దేశం నలుమూలల నుంచి పలురంగాల నుంచి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. 23వ తేదీ నుంచి బాల రాముడి దర్శన భాగ్యం సామాన్యులకూ దక్కుతున్నది. అయితే, ఈ రోజు పెద్ద మొత్తంలో భక్తులు పోటెత్తడంతో తొందరగానే ఆలయ ద్వారాలు మూసేశారు.

click me!