ఎల్బీనగర్ కార్ల షోరూం అగ్నిప్రమాదం : నైట్రోజన్ గ్యాస్ సిలిండర్లవల్లే చెలరేగిన మంటలు...

By SumaBala Bukka  |  First Published May 31, 2023, 8:42 AM IST

ఎల్బీనగర్ కార్ల షోరూంలో జరిగిన అగ్నిప్రమాదానికి నైట్రోజన్ గ్యాసే కారణమని తెలుస్తోంది. ఆ సిలిండర్లు పేలడంతోనే ప్రమాదం జరిగిందని ప్రాథమిక అంచనా.


హైదరాబాద్ : ఎల్బీనగర్ లోని ఓ కార్ల గ్యారేజ్ లో మంగళవారం సంభవించిన అగ్ని ప్రమాదంలో 9 కార్లు పూర్తిగా కాలి బూడిదయ్యాయి అయ్యాయి. మరో మూడు కార్లు తీవ్రంగా కాలిపోయాయి. రెస్క్యూ టీం. నాలుగు కార్లను బైటికి తీసింది. అయితే, ప్రమాదానికి కారణం పెయింట్ వేయడం కోసం వాడే నైట్రోజన్ గ్యాస్ సిలిండర్లు పేలడమేనని తేలింది. మొదట మంటలు అక్కడే ప్రారంభమయ్యాయని ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారని ప్రముఖ టీవీ ఛానల్ కథనం ప్రసారం చేసింది. 

కార్ ఓ మ్యాన్ అనే కార్ల షోరూంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ షోరూంలో ఖరీదైన కార్లకు డెంటింగ్, పెయింటింగ్ వేసి రిపేర్లు చేస్తుంటారు. ముఖ్యంగా యాక్సిడెంట్ అయిన కార్లకు ఇక్కడి రిపేర్లు జరుగుతుంటాయి. అలా దాదాపు 11 ఖరీదైన కార్లు దగ్థమయ్యాయి. మంటలు అంటుకుని భారీ శబ్దంతో గ్యాస్ సిలిండర్లు పేలడం, అగ్నికిలలు ఎగిపి పడుతుండడంతో చుట్టు పక్కల ఇళ్లలో ఉన్నవారు తీవ్ర భయాందోళనలకు లోనయ్యారు.

Latest Videos

ఎల్బీ నగర్‌ : టింబర్ డిపోలో భారీ అగ్నిప్రమాదం.. కార్ల షోరూమ్‌కి వ్యాపించిన మంటలు, 50 వాహనాలు దగ్ధం

ఈ ప్రమాదానికి సంబంధించిన సమాచారం అందండంతో అక్కడికి చేరుకున్న పోలీసులు, అగ్ని మాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకురావడానికి తీవ్రంగా శ్రమించారు. దాదాపు రెండున్నర గంటలపాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. కానీ, ఇప్పటికీ షోరూంలో కొన్ని చోట్ల పొగలు వస్తున్నాయి. స్థానికులే వీటిని ఆర్పేశారు. 

అయితే, ఈ షోరూంకి ఈ ప్రమాదంలో దాదాపు రూ.3కోట్లు నష్టం వాటిల్లిందని యజమాని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఆ కార్ల యజమానులకు ఏం సమాధానం చెప్పాలో తెలియక, తీవ్ర దిగ్భాంత్రిలో ఉన్నాడు. మరోవైపు ఈ షోరూం పక్కనే మల్టీప్లెక్స్, అపార్ట్‌మెంట్లు ఉండడంతో జనావాసాలకు దూరంగా మార్చాలని 2 నెలల క్రితమే జీహెచ్ఎంసీ నోటీసులు ఇచ్చిందని తెలుస్తోంది. 

షోరూంలో మొదట షార్ట్ సర్క్యూట్  జరగడంతో.. ఆ మంటలు, పెయింట్ డబ్బాలు, నైట్రోజన్ గ్యాస్ సిలిండర్లకు అంటుకోవడంతో తీవ్రత పెరిగింది. ఈ షోరూంలో ప్రధానంగా కార్ల రిపేర్లు జరుగుతాయి కాబట్టి... పెయింట్ డబ్బాలు ఎక్కువగా ఉన్నాయి. అవన్నీ మంటల ధాటికి పేలి.. షోరూం మొత్తం పడి ఉన్నాయి. వీటివల్ల కూడా మంటలు అదుపులోకి రావడానికి చాలా సమయం పట్టిందని తెలుస్తోంది. 

click me!