ఎల్బీనగర్- అమీర్‌పేట మెట్రో‌ను ప్రారంభించిన గవర్నర్

By narsimha lodeFirst Published Sep 24, 2018, 12:25 PM IST
Highlights

ఎల్బీనగర్-అమీర్‌పేట మెట్రో రైలు మార్గాన్ని  సోమవారం నాడు రాష్ట్ర గవర్నర్ నరసింహాన్  ప్రారంభించారు.


హైదరాబాద్: ఎల్బీనగర్-అమీర్‌పేట మెట్రో రైలు మార్గాన్ని  సోమవారం నాడు రాష్ట్ర గవర్నర్ నరసింహాన్  ప్రారంభించారు. సుమారు 16 కి.మీ. దూరంలోని ఈ మార్గాన్ని కనీసం 50 నిమిషాల్లో ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది.

ఇప్పటికే  నాగోల్ నుండి మియాపూర్‌ వరకు  మెట్రో రైలు మార్గం పూర్తైంది. రెండో మార్గంగా ఎల్బీనగర్ -అమీర్‌పేట వరకు మెట్రో రైలు‌ను గవర్నర్ ప్రారంభించారు. 
 అమీర్‌పేట నుంచి ఎల్‌బీనగర్‌ మార్గంలో మెట్రోని సోమవారం అమీర్‌పేట మెట్రోస్టేషన్‌లో మధ్యాహ్నం 12.15 గంటలకు గవర్నర్‌  నరసింహన్‌  ప్రారంభించారు. సాయంత్రం 6 గంటల తర్వాత నుంచి ప్రయాణికులను అనుమతించనున్నారు.

అమీర్‌పేట నుండి ఎల్బీనగర్ కు  సుమారు 16కి.మీ. ఈ 16 కి.మీల దూరాన్ని కేవలం 50 నిమిషాల్లో ప్రయాణం చేయవచ్చు. బస్సుల్లో అయితే సుమారు గంటన్నరకుపైగా సమయం పట్టే అవకాశం ఉంటుంది. ట్రాఫిక్ జామ్ అయితే  ఇక నరకమే.

ఈ మార్గంలో సుమారు 17 రైల్వేస్టేషన్లు ఉన్నాయి. అయితే నాలుగు రైల్వేస్టేషన్లో మాత్రమే పార్కింగ్ సౌకర్యం కల్పించారు. ఆసియాలోనే అతిపెద్ద ఇంటర్ ఛేంజ్ స్టేషన్‌‌‌గా ఏంజీబీఎస్‌ పేరోందింది.  ఎంజీబీఎస్ కూడ ఈ మార్గంలోనే ఉంది.

రైల్వేస్టేషన్లలో బ్యాటరీ సైకిళ్లను ప్రయాణీకులకు అందుబాటులో ఉంచారు.ఎల్బీనగర్-అమీర్‌పేట మార్గంలో ప్రతి రోజూ సుమారు 30వేల మంది ప్రయాణిస్తారని అంచనా. ఈ మార్గంలో 8 నిమిషాలకు ఒక మెట్రో నడపనున్నారు.

రద్దీ వేళల్లో ఆరున్నర నిమిషాలకు ఒకటి నడుపుతారు.మెట్రో కారిడార్-1, మెట్రో కారిడార్-2లను కలుపుకొని ఇప్పటికి 46 కి.మీ రైలు మార్గం పొడవు 46 కి.మీ. చేరింది.ఢిల్లీ మెట్రో రైలు మార్గం తర్వాత హైద్రాబాద్ మెట్రో రైలు మార్గం అతి పెద్దదిగా పేరొందింది.కారిడార్‌-2లోని నాగోల్‌ నుంచి అమీర్‌పేట వరకు 30 కి.మీ. మార్గాన్ని ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్‌ గత ఏడాది నవంబరు 28న ప్రారంభించారు.


 

 

click me!
Last Updated Sep 24, 2018, 12:51 PM IST
click me!