కేంద్రం తాజా ప్రకటన: తెలంగాణలో రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లు ఇవే...

By telugu team  |  First Published May 1, 2020, 11:21 AM IST

తెలంగాణలోని రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లను కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. తెలంగాణలోని 33 జిల్లాలు ఏయే జోన్ల కిందికి వస్తాయో చూడండి


హైదారబాద్: తెలంగాణలో కరోనా ప్రభావిత జిల్లాలను కేంద్రం ప్రకటించింది. తాజాగా తెలంగాణలో రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లను ప్రకటించింద్ి. తెలంగాణలో హైదరాబాదులోనే అత్యధిక కేసులు నమోదయ్యాయి. అత్యధిక కేసులు నమోదైన జిల్లాలను కేంద్రం రెడ్ జోన్లు గా ప్రకటించింది. తొమ్మిది జిల్లాలను గ్రీన్ జోన్లుగా ప్రకటించింది. 

తెలంగాణలో ఐదు జిల్లాలను రెడ్ జోన్లుగా కేంద్రం ప్రకటించింది. 18 జిల్లాలను ఆరెంజ్ జోన్లుగా ప్రకటించింది. కొద్ది రోజులుపాటు తగ్గుముఖం పడుతూ వచ్చిన కరోనా వైరస్ కేసులు గురువారం ఒక్కసారిగా పెరిగిన విషయం తెలిసిందే.

Latest Videos

undefined

రెడ్‌ జోన్లుగా హైదరాబాద్‌, రంగారెడ్డి, సూర్యాపేట,  వరంగల్ అర్బన్, మేడ్చల్, వికారాబాద్ జిల్లాలు

ఆరెంజ్‌ జోన్లు: గద్వాల, నిర్మల్, నిజామాబాద్, నల్లగొండ, ఆదిలాబాద్, సంగారెడ్డి, ఆసీఫాబాద్, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, జగిత్యాల, జనగాం, మెదక్, సిరిసిల్ల, భూపాలపల్లి, నారాయణపేట, మంచిర్యాల

గ్రీన్‌ జోన్లు: ములుగు, పెద్దపల్లి, నాగర్ కర్నూలు, మహబూబాబాద్ , భద్రాద్రి కొత్తగూడెం, వనపర్తి, సిద్దిపేట, భువనగిరి యాదాద్రి, వరంగల్ రూరల్

click me!