అదిలాబాద్ రిమ్స్ లో అర్థరాత్రి వైద్య విద్యార్థులపై దాడి..

By SumaBala Bukka  |  First Published Dec 14, 2023, 8:20 AM IST

ఆస్పత్రిలోని అసౌకర్యాలపై ప్రశ్నించినందుకే దాడి చేశారని అంటున్నారు. దుండగుల్లో కొందరు రౌడీ షీటర్లు కూడా ఉన్నట్లు సమాచారం. 


అదిలాబాద్ : అదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రిలో అర్థరాత్రి కలకలం నెలకొంది. ఆస్పత్రిలోకి చొరబడ్డ దుండగులు వైద్యవిద్యార్థులపై దాడికి దిగారు. రిమ్స్ ఆస్పత్రి డైరెక్టర్ ఫ్యాన్స్ అని ఆ దుండగులు చెప్పినట్టు సమాచారం. ఆస్పత్రిలోని అసౌకర్యాలపై ప్రశ్నించినందుకే దాడి చేశారని అంటున్నారు. దుండగుల్లో కొందరు రౌడీ షీటర్లు కూడా ఉన్నట్లు సమాచారం. 

దాడికి దిగడంతో  వైద్య విద్యార్థులు, దుండగుల మధ్య తోపులాట జరిగింది. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వైట్ కలర్ క్రేటా, బండ్లమీద వచ్చిన దుండగులు వైద్యవిద్యార్థులను దారుణంగా కొట్టారు. దీనిమీద విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఉదయం నుంచి డ్యూటీలను బహిష్కరించారు. 

Latest Videos

ఈ ఘటనలో ఇద్దరు ఇంటర్న్ లు తీవ్రంగా గాయపడ్డారు. క్యాంపస్ లో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. బయటి వ్యక్తులు క్రాంతి అనే అసిస్టెంట్ ప్రొఫెసర్ తో పాటు క్యాంపస్ లోకి వచ్చారని..వారే తమ మీద అకారణంగా దాడికి పాల్పడ్డారని విద్యార్థులు అంటున్నారు. 

దాడికి పాల్పడిన వారిలో ఒకరు వసీం అనే వ్యక్తి అని తెలిపారు. అతనితోపాటు మరోముగ్గురు తమ మీద దాడి చేశారని తెలిపారు. దాడి నేపథ్యంలో విద్యార్థులు క్రాంతి దిష్టి బొమ్మను దహనం చేసి, ఆందోళన చేపట్టారు. మెయిన్ గేట్ దగ్గరున్న సెక్యూరిటీని లెక్కచేయకుండా దుండగులు క్యాంపస్ లోకి చొరబడ్డారని ఆరోపించారు. 

ఈ ఘటన నేపథ్యంలో పోలీసులు రిమ్స్ పరిసరాల్లో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. దుండగులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. 

click me!