కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ కు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కంటి పరీక్షలు నిర్వహించారు. ఈ ఆసక్తికరమైన ఫోటోను మరో మాజీ ఎమ్మెల్యే ఎక్స్ లో పోస్ట్ చేసారు.
నిజామాబాద్ : ఓ ఎమ్మెల్యేకు మరో ఎమ్మెల్యే... ఓ డాక్టర్ కు మరో డాక్టర్ పరీక్షలు చేసిన అరుదైన ఘటన నిజామాబాద్ జిల్లాలో వెలుగుచూసింది. ఇద్దరూ డాక్టర్లే... ఇద్దరి పేర్లు సంజయ్... ఇద్దరికీ రాజకీయాలపై ఆసక్తి... ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇద్దరూ విజయం సాధించారు. అంతేకాదు ఇద్దరూ ప్రతిపక్ష భారత రాష్ట్ర సమితికి చెందినవారే. ఇలా కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్, జగిత్యాల ఎమ్మెల్యే ఎం. సంజయ్ చాలా విషయాల్లో సారుప్యత కలిగివున్నారు. అయితే ఈ ఎమ్మెల్యేలిద్దరు తాజాగా తమ పార్టీ నాయకుల కోసం మళ్లీ డాక్టర్ కోటు వేయాల్సి వచ్చింది.
కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ కంటిసమస్యతో బాధపడుతుండటంతో బిఆర్ఎస్ పార్టీకే చెందిన ఎమ్మెల్యేను కలిసారు. కంటి సమస్య వుంటే డాక్టర్ ను కలవాలిగానీ ఎమ్మెల్యేను కలవడం ఏమిటని ఆశ్చర్యపోకండి. సంజయ్ కలిసిన జగిత్యాల ఎమ్మెల్యే ఓ కంటి డాక్టర్ కూడా... ఎమ్మెల్యేగా మారినతర్వాత ప్రాక్టీస్ మానేసారు. కానీ తాజాగా తోటి ఎమ్మెల్యే కోసం మళ్లీ కంటి డాక్టర్ అవతారం ఎత్తారు. ఇలా కోరుట్ల ఎమ్మెల్యే కు జగిత్యాల ఎమ్మెల్యే కంటి పరీక్ష చేసారు.
undefined
ఇదిలావుంటే కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ కూడా ఇటీవల పార్టీ అధినేత కోసం డాక్టర్ గా మారాల్సి వచ్చింది. ఎమ్మెల్యేగా మారకముందు సంజయ్ యశోద హాస్పిటల్ లోనే డాక్టర్ గా పనిచేసేవారు. దీంతో తుంటి ఎముక విరిగి యశోదాలో చేరిన కేసీఆర్ కు సంజయ్ శస్త్రచికిస్త అందించినట్లు సమాచారం. ఇలా సొంత పార్టీ ఎమ్మెల్యేనే కేసీఆర్ కు చికిత్స అందించారు.
Read More కేసీఆర్ విజ్ఞప్తి చేసినా వినడంలేదు... హాస్పిటల్ ముందు అభిమానుల ఆందోళన
కోరుట్ల మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు తనయుడే కల్వకుంట్ల సంజయ్. ఇంతకాలం డాక్టర్ గా ప్రజలకు సేవలందించిన ఆయన తన తండ్రి వారసత్వాన్ని కొనసాగించేందుకు ఎమ్మెల్యేగా మారారు. ఇంతకాలం కోరుట్ల ఎమ్మెల్యేగా పనిచేసిన విద్యాసాగర్ రావు ఈసారి మాత్రం కొడుకును బరిలోకి దింపారు. బిఆర్ఎస్ తరపున పోటీచేసి గెలిచిన సంజయ్ మొదటిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు.
ఎమ్మెల్యేగా మారిన సంజయ్ తన నియోజకవర్గ సమస్యలు తెలుసుకునేందుకు సరికొత్త కార్యక్రమాన్ని ప్రారంభించారు. 'మన ఊరికి మన ఎమ్మెల్యే' పేరిట ప్రతిరోజే ఉదయం స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి నియోజకవర్గంలో పర్యటించేందుకు సిద్దమయ్యారు. ఈ కార్యక్రమాన్ని బుధవారం తెల్లవారుజామున మల్లాపూర్ మండలకేంద్రంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.