బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే లాస్య నందిత అంత్యక్రియలు ముగిశాయి. అధికారిక లాంఛనాలతో మారేడ్ పల్లి స్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు.
last Rites: కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందితకు కన్నీటి వీడ్కోలు పలికారు. బంధుమిత్రులు, అభిమానులు, రాజకీయ పార్టీల ప్రముఖుల మధ్య ఆమె అంతిమ యాత్ర సాగింది. మారేడ్‌పల్లిలోని స్మశానవాటికలో ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో ఆమె అంత్యక్రియలు ముగిశాయి.
సికింద్రాబాద్ కార్ఖానాలోని ఎమ్మెల్యే నివాసం వద్ద నుంచి ఆమె అంతిమ యాత్ర సాగింది. ఈ యాత్రలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ముఖ్యమైన నాయకులు పాల్గొన్నారు. మాజీ మంత్రి హరీశ్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి సహా పలువురు లాస్య నందిత పాడె మోశారు.
లాస్య నందిత మృతికి అన్ని పార్టీల నాయకులు సంతాపం ప్రకటించారు. సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కే చంద్రశేఖర్ రావులు లాస్య నందిత భౌతిక దేహానికి నివాళులు అర్పించారు.
Also Read: Lasya Nandita: పాడే మోసిన హరీశ్ రావు.. వీడియో వైరల్
ఈ రోజు ఉదయం ఆమె ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే.