Lasya Nandita: పాడే మోసిన హరీశ్ రావు.. వీడియో వైరల్

By Mahesh K  |  First Published Feb 23, 2024, 7:28 PM IST

మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డిలు లాస్య నందిత పాడెను మోశారు. 
 


బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే లాస్య నందిత ఈ రోజు రోడ్డు ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. కంటోన్మెంట్ నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన సాయన్న బిడ్డ, దళిత సమాజం నుంచి శాసన సభలో అడుగుపెట్టిన లాస్య నందిత ఆకస్మిక మరణం పొందారు. ఆమె భౌతిక దేహానికి ఈ రోజు అంత్యక్రియలు నిర్వహించారు.

ఈ అంత్యక్రియల్లో మాజీ మంత్రులు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ప్రముఖ నాయకులు హాజరయ్యారు. ఇందులో భాగంగా లాస్య నందిత భౌతికదేహాన్ని పాడేపై తీసుకెళ్లుతుండగా.. అందులో మాజీ మంత్రులు పాల్గొన్నారు. లాస్య నందిత భౌతిక దేహాన్ని తీసుకెళ్లుతున్న పాడెను మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు  హరీశ్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డిలు మోశారు.

ఎమ్మెల్యే లాస్య నందిత గారి అంత్యక్రియల్లో సహచర ఎమ్మెల్యేలు మరియు పలువురు బీఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు కలిసి పాల్గొనడం జరిగింది. pic.twitter.com/mh8Zb7OhEp

— Harish Rao Thanneeru (@BRSHarish)

Latest Videos

Also Read: Dalit: సాయన్న నోచుకోలేదు.. లాస్య నందితకు దక్కుతున్న గౌరవం

ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నది. తన్నీరు హరీశ్ రావు స్వయంగా ఈ వీడియోను తన ఎక్స్ హ్యాండిల్‌లో పోస్టు చేశారు.

click me!