వీడిన గోనెసంచిలో మృతదేహం మిస్టరీ : పోలీసుల అదుపులో అన్నాచెల్లెళ్లు...అంత్యక్రియలకు డబ్బులు లేక..

By SumaBala Bukka  |  First Published May 12, 2023, 10:41 AM IST

లంగర్ హౌజ్ లో కలకలం రేపిన డెడ్ బాడీ మిస్టరీ వీడింది. అంత్యక్రియలకు డబ్బులు లేక సొంత అన్నాచెల్లెళ్లే దివ్యాంగుడి మృతదేహాన్నిముక్కలుగా చేసినట్లు పోలీసులు తెలిపారు. 


హైదరాబాద్ : హైదరాబాద్ లోని లంగర్ హౌజ్ ప్రాంతంలో రెండు గోనెసంచుల్లో ముక్కలుగా నరికిన దివ్యాంగుడి మృతదేహం కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ మృతదేహం మిస్టరీని పోలీసులు చేధించారు. చనిపోయి దివ్యాంగుడిని అశోక్ గా గుర్తించారు. అతని మృతదేహాన్ని అతని తోబుట్టువులైన రాజు, స్వరూపలే ముక్కలుగా నరికి, గోనెసంచిలో కుక్కి.. అక్కడ తెచ్చి పడేసినట్లుగా గుర్తించారు.

ఈ ఘటన వెలుగులోకి రావడంతో సీసీ టీవీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు కాళీ మందిర్ ఎన్ఎఫ్ఎస్ఎల్ కు చెందిన రాజు, స్వరూపలను అదుపులోకి తీసుకున్నారు. వీరి విచారణలో వెలుగు చూసిన వాస్తవాలు హృదయాల్ని ద్రవీంపచేసేలా ఉన్నాయి. తమ అన్న అశోక్ మద్యానికి బానిసై తీవ్ర అస్వస్థతకు గురయ్యాడని, ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ మరణించాడని రాజు, స్వరూప తెలిపారు. 

Latest Videos

అంత్యక్రియలు చేయడానికి కూడా తమ దగ్గర డబ్బులు లేకపోవడంతో...అన్న మృతదేహాన్ని ముక్కలుగా చేసి, గోనెసంచిలో కుక్కి.. అక్కడ పెట్టామని చెప్పారు. తాము అన్నను చంపలేదని, చనిపోయిన తరువాతే ముక్కలు చేశామని చెప్పుకొచ్చారు. 

హైదరాబాద్ లంగర్ హౌజ్ లో గోనెసంచిలో డెడ్ బాడీ కలకలం.. దివ్యాంగుడిని చంపి, ముక్కలుగా చేసి..

ఆస్పత్రినుంచి తీసుకువచ్చాక.. గురువారం ఇంట్లో చనిపోయాడు.. అంత్యక్రియలకు డబ్బులు లేకపోవడంతో.. ముక్కలుగా చేసి గోనెసంచిలో పెట్టి.. లంగర్ హౌజ్ లోని నీతి అయోగ్ సమీపంలోని ఫుట్ పాత్ మీద పెట్టి వెళ్లిపోయారు. అశోక్ చనిపోయిన తరువాతే మృతదేహాన్ని ముక్కలుగా చేశామని వారు చెబుతున్నారు.వారి పేదరికానికి జాలి చూపాలో, ఇంత దారుణమైన నిర్ణయానికి వచ్చినందుకు కోపానికి రావాలో అర్థం కావడం లేదని స్థానికులు చెబుతున్నారు. 

ఇదిలా ఉండగా, శుక్రవారం హైదరాబాద్ లో దారుణ ఘటన వెలుగు చూసింది. గోనెసంచిలో ఓ వ్యక్తి మృతదేహం కలకలం రేపింది. లంగర్ హౌజ్ ప్రాంతంలో రెండు గోనెసంచుల్లో ముక్కలుగా నరికిన దివ్యాంగుడి మృతదేహం లభించింది. ఎక్కడో చంపి, శరీరాన్ని ముక్కలుగా చేసి  రెండు గోనెసంచుల్లో కుక్కారు. వాటిని లంగర్ హౌజ్ ప్రాంతంలో ఫుట్ పాత్ మీద పెట్టి వెళ్లారు. 

ఓ ఆటోలో వచ్చిన ఇద్దరు వ్యక్తులు, గోనెసంచులను దించి.. రోడ్డు పక్కన ఫుట్ పాత్ మీద పెడుతుండడం స్థానికులు చూశారు. కాసేపటికి వాటినుంచి రక్తం కారుతుండడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వారు వచ్చి చూడగా అందులో మృతదేహం లభించింది. దీంతో ఒక్కసారిగా భయాందోళనలు చెలరేగాయి. 

బాపూఘాట్ నుంచి లంగర్ హౌజ్ కు వచ్చే ప్రాంతంలో, మిలట్రీ ఏరియా సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కాళీ మందిర్ సమీపంలో చంపి ఇక్కడ పడేసి ఉంటారని అనుమానిస్తున్నారు  పది రోజుల క్రితం కూడా ఇలాంటి ఘటనే వెలుగు చూసింది. ఓ మహిళను చంపి గోనెసంచితో మృతదేహాన్ని ముక్కలుగా చేసి పెట్టి వెళ్లారు. వరుస ఘటనలతో ఏం జరుగుతుందో అర్థం కాక స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. 

సీసీ టీవీ ఫుటేజీ ఆదారంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అనుమానితులుగా గుర్తించిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

click me!