హైద్రాబాద్‌లో ఉగ్రమూకల పక్కా ప్లాన్: డార్క్ వెబ్ సైట్‌లో నిందితుల సంభాషణ

By narsimha lode  |  First Published May 12, 2023, 10:25 AM IST

హైద్రాబాద్  నగరంలో  హిజ్భ్  ఉత్ తహరీక్  సంస్థ  సభ్యులు  డార్క్ వెబ్ సైట్ ద్వారా   చాటింగ్  నిర్వహించినట్టుగా  దర్యాప్తు సంస్థలు గుర్తించాయి.  


హైదరాబాద్:   నగరంలో  హిజ్బ్  ఉత్ తహరీక్  సంస్థ సభ్యులు  తమ ఉనికిని  బయటకు రాకుండా  జాగ్రత్తలు తీసుకున్నారు.   డార్క్ వెబ్ సైట్ , రాకెట్ చాట్,  తీమ్రా యాప్ లతో   నిందితులు  చాటింగ్  నిర్వహించారని దర్యాప్తు  సంస్థలు  గుర్తించాయి. మూడు రోజుల క్రితం  మధ్యప్రదేశ్  ఏటీఎస్ ,  తెలంగాణ పోలీసులు  జాయింట్   ఆపరేషన్ నిర్వహించారు.  మొత్తం  17 మందిని  పోలీసులు అరెస్ట్  చేశారు. అరెస్టైన వారిలో  11 మంంది మధ్యప్రదేశ్ రాష్ట్రానికి  చెందినవారు.  మరో ఆరుగురు హైద్రాబాద్ కు చెందినవారు.

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్ కు  చెందిన  యాసిర్ ఆదేశాల మేరకు  హైద్రాబాద్ లో  సలీం  కార్యకలాపాలు  నిర్వహించినట్టుగా  దర్యాప్తు సంస్థలు  గుర్తించాయి. 18 మాసాలుగా  హైద్రాబాద్ పాతబస్తీలో   నిందితులు నివాసం ఉంటున్నారు.  ఇంటలిజెన్స్  బ్యూరో  కొంతకాలంగా  వీరి కార్యకలాపాలపై  నిఘాను పెట్టింది.

Latest Videos

  నాలుగు రోజుల క్రితం   మధ్యప్రదేశ్ ఏటీఎస్  టీమ్  హైద్రాబాద్ కు వచ్చింది.   నగరంలో  హిజ్భ్ ఉత్  తహరీక్  సంస్థ కార్యకలాపాల గురించి వివరించారు.  ఏటీఎస్, తెలంగాణ పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. 

హైద్రాబాద్ లో  ఉగ్ర మూకలు  మూడు దశల్లో  తమ ప్లాన్ ను  అమలు చేసేలా  వ్యూహారచన చేశాయి.  ఈ మేరకు  ఓ యూట్యూబ్ చానెల్ ను కూడా  నిర్వహిస్తున్నారు.   ఈ యూట్యూబ్ చానెల్ కు  3600 మంది సబ్ స్క్రైబర్లున్నారు. వీరంతా  ఎవరనే విషయమై  పోలీసులు ఆరా తీస్తున్నారు. 

 దాడులకు  పాల్పడేందుకు గాను  అనంతగిరి అడవుల్లో నిందితులు  శిక్షణ పొందారని  కూడా దర్యాప్తు సంస్థలు గుర్తించాయి.   పేలుడు పదార్దాల తయారీ,  తుపాకీ పేల్చడం  వంటి  వాటిపై  నిందితులు  శిక్షణ పొందారని  దర్యాప్తు  సంస్థలు  గుర్తించాయి. 

also read:భోపాల్, హైద్రాబాద్ లలో డ్రోన్లతో దాడులకు ప్లాన్: ఉగ్ర నిందితుల కేసులో కీలక విషయాలు

మాల్స్,  ప్రభుత్వ  సంస్థలు , జనసమ్మర్ధం ఎక్కువగా  ఉన్న ప్రాంతాల్లో   దాడులు  చేయాలని   నిందితులు  ప్లాన్  చేశారు.  అంతేకాదు  కనీసం రెండు  రోజుల పాటు    అన్నపానీయాలు  లేకుండా  ఉండేలా  కూడా  నిందితులు  ఫిట్ నెస్ పై  కేంద్రీకరించారు

click me!