హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆశప్ప హత్య..

Published : May 12, 2023, 10:19 AM IST
హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆశప్ప హత్య..

సారాంశం

హైదరాబాద్ లో ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి దారుణ హత్య జరిగింది. గుర్తు తెలియని నలుగురు వ్యక్తులు, కత్తులు, రాడ్లతో అతని మీద దాడి చేసి చంపేశారు. 

హైదరాబాద్ : హైదరాబాద్ శివారులో దారుణ హత్య వెలుగు చూసింది. రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆశప్ప అలియాస్ అశోక్ ను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. ఆశప్ప మీద నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి హత్య చేశారు. కత్తులు, ఇనుపరాడ్లతో దాడి చేసి హత్య చేసినట్లు సమాచారం. 

రెండేళ్ల క్రితం కూడా మృతుడి మీద హత్యాయత్యం జరిగింది. నిందితుడు మహబూబ్ నగర్ జిల్లా నారాయణ్ పేట్ కు చెందిన బుగ్గప్పగా అనుమానిస్తున్నారు. ఆశప్ప నారాయణపేట్ నుంచి వచ్చి హైదరాబాద్ శివారుల్లోని రాంపల్లి టీపీఎస్ కాలనీలో అశోక్ గా పేరు మార్చుకుని ఉంటున్నాడు. ఆశప్ప హత్యకు పాత కక్షలే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.

రాంపల్లి టీపీఎస్ కాలనీలో ఓ చోట మెట్ల మీద అతను కూర్చుని ఉండగా, తెల్లటి కారులో వచ్చిన కొంతమంది అతని మీద దాడి చేసి హత్య చేశారు. అయితే, 2019లో ఓ గ్రామ సర్పంచ్ హత్య కేసులో ఆశప్ప నిందితుడిగా ఉన్నాడు. దీంతో అతనికి సంబంధించిన వారు ఇందులో ఉన్నారా? అనే కోణంలోనూ పోలీసులు విచారిస్తున్నారు. ప్రస్తుతం ఉస్మానియా ఆస్పత్రిలో ఆశప్ప మృతదేహం ఉంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Hyderabad IT Jobs : మీరు సాప్ట్ వేర్ జాబ్స్ కోసం ప్రయత్నిస్తున్నారా..? కాగ్నిజెంట్ లో సూపర్ ఛాన్స్, ట్రై చేయండి
ఇప్పుడే కొనేయండి.. హైద‌రాబాద్‌కు దూరంగా అభివృద్ధికి ద‌గ్గ‌ర‌గా.. ఈ గ్రామం మ‌రో గ‌చ్చిబౌలి కావ‌డం ఖాయం.