
Palla Rajeshwar Reddy: బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీ కి చెందిన జనగాం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డితో పాటు ఆయన భార్య నీలిమ రెడ్డిపై రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలోని పోచారం ఐటీ కారిడార్ పీఎస్ లో ఎఫ్ఐఆర్ నమోదు అయింది. తప్పుడు పత్రాలతో భూ ఆక్రమణలకు యత్నించారని, ప్రశ్నించినందుకు బెదిరించారని వచ్చిన ఫిర్యాదు ఆధారంగా పల్లాతో పాటు ఆయన భార్య నీలిమ, మరో వ్యక్తి మధుకర్రెడ్డిపై కేసు నమోదైంది. ఈ మేరకు పీర్జాదిగూడకు చెందిన రాధిక ఫిర్యాదు చేశారు. దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు పల్లా దంపతులపై కేసు నమోదు చేశారు.