మంజీరాకు పోటెత్తిన వరద: ఏడుపాయల ఆలయం తాత్కాలికంగా మూసివేత

By narsimha lode  |  First Published Jul 24, 2022, 10:20 AM IST

మంజీరా నది పరవళ్లు తొక్కడంతో ఏడుపాయల ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. నిన్న కురిసిన వర్షాలకు మంజీరా నదికి వరద పోటెత్తింది. ఈ వరద నీరు ఏడుపాయల ఆలయం ముందు నుండి ప్రవహిస్తుంది. 


మెదక్: Manjeera River పరవళ్లు తొక్కడంతో ఏడుపాయల ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. శనివారం నాడు కురిసిన వర్షానికి వరద పోటెత్తింది. దీంతో Edupayala Temple ఆలయం దగ్గరగా నది ప్రవాహం సాగుతుంది. దీంతో ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. వన దుర్గమ్మ ఆలయం వద్ద మంజీరా నది పాయలుగా విడిపోయి ప్రవహిస్తుంది. దీంతో  ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. మరో వైపు రాజగోపురంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అర్చకులు.

ఈ నెల 12వ  తేదీన కూడా మంజీరా నదికి వరద పోటెత్తింది. అయితే ఆ సమయంలో ఆలయం వద్దకు వరద నీరు చేరలేదు. అయితే వరద పోటెత్తితే ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉందని భావించిన అధికారులు భక్తులకు ధర్శనాన్ని నిలిపివేశారు. దుర్గా భవాని ప్రాజెక్టు పూర్తిగా నిండి మంజీరా నది ప్రవాహం కొనసాగింది. నిన్న కురిసిన వర్షాలకు మంజీరా నదికి వరద పోటెత్తడంతో ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.

Latest Videos

undefined

2021 సెప్టెంబర్ 9వ తేదీన కూడా మంజీరా నదికి వరద పోటెత్తడంతో ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. 2021 మార్చి మాసంలో ఏడుపాయల ఆలయం ఈవోకి కరోనా సోకడంతో  వారం రోజుల పాటు ఆలయాన్ని మూసివేశారు.

తెలంగాణ రాష్ట్రంలో ఇంకా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలుజారీ చేసింది. రెడ్ అలెర్ట్ ను ఉపసంహరించుకొని ఎల్లో అలెర్ట్ ను జారీ చేసింది వాతావరణ శాఖ. ఈ నెల 26న జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్ , సిరిసిల్ల జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. మరో వైపు ఇప్పటికే కురిసిన వర్షాలతో లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు చేరింది.

ఈ  నేపథ్యంలో వర్షాలు వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరుతున్నారు.  గోదావరి, నది పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని  అధికారులుర సూచిస్తున్నారు. ఇప్పటికే గోదావరికి గత 100 ఏళ్లలో రాని వరద జూలై మాసంలోనే వచ్చింది. ఈ తరుణంలో మళ్లీ వర్షాలు వచ్చే అవకాశం ఉందని అధికారులు వార్నింగ్ ఇవ్వడంతో ప్రజలు బిక్కు బిక్కుమంటున్నారు. ఈ వర్షాల కారణంగా ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు.

ఎగువన కురుస్తున్న వర్షాలతో కృష్ణానదికి కూడా వరద పోటెత్తింది.కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టులు కూడా వరద వస్తుంది.ఈ ప్రాజెక్టులకు కూడ నీరు చేరుతుంది. సాధారణంగా ఆగష్టు, సెప్టెంబర్ మాసాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. గోదావరి నదికి వరద పోటెత్తే అవకాశం ఉంది. రానున్న రోజులు మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులు గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలకు సూచిస్తున్నారు.

also read:రెడ్ అలెర్ట్ ఉప సంహరణ: తెలంగాణలో ఎల్లో అలెర్ట్ జారీ, కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు పడే చాన్స్

 గోదావరి నదికి భారీగా వరదలు రావడంతో భద్రాచలం వద్ద  గోదావరి నది 70 అడుగులు దాటి ప్రవహించింది. భద్రాచలం పట్టణానికి సమీపంలోని బ్రిడ్జిపై వాహనాల రాకపోకలను కూడా నిలిపివేశారు. భారీ వర్షాల కారణంగా గోదావరి వరద పోటెత్తిన కారణంగా ఛత్తీస్ ఘడ్, ఏపీ వంటి రాష్ట్రాలకు రాకపోకలు నిలిచిపోయాయి. 


 

 

click me!