హైదరాబాద్‌లో రెండు రోజులు వైన్ షాప్స్ బంద్.. వివరాలు ఇవే..

Published : Jul 24, 2022, 10:29 AM IST
 హైదరాబాద్‌లో రెండు రోజులు వైన్ షాప్స్ బంద్..  వివరాలు ఇవే..

సారాంశం

హైదరాబాద్‌లో రెండు రోజుల పాటు మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. లాల్ దర్వాజా బోనాల నేపథ్యంలో జంట నగరాల్లోని మద్యం దుకాణాలు, బార్లు మూసివేయాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఆదేశించారు. 

హైదరాబాద్‌లో రెండు రోజుల పాటు మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. లాల్ దర్వాజా బోనాల నేపథ్యంలో జంట నగరాల్లోని మద్యం దుకాణాలు, బార్లు మూసివేయాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఆదేశించారు. హైదరాబాద్ సిటీ పోలీస్ పరిధిలోని వెస్ట్, ఈస్ట్ జోన్‌లలో ఆదివారం ఉదయం 6 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు  రెస్టారెంట్లలోని బార్‌లతో సహా అన్ని వైన్ షాప్స్ మూతపడనున్నాయి. బోనాల పండగను పరస్కరించుకుని సౌత్ జోన్‌లో ఆదివారం ఉదయం 6 గంటల నుంచి మంగళవారం ఉదయం 6 గంటల వరకు బార్లు, రెస్టారెంట్స్ మూసివేయాలని సీపీ ఆదేశించారు. ఈ మేరకు ఒక పత్రికా ప్రకటనను విడుదల చేశారు. 

ఇదిలా ఉంటే బోనాల సందర్భంగా హైదరాబాద్‌లో నేడు, రేపు ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగనున్నాయి. లోయ‌ర్ ట్యాంక్‌బండ్ వ‌ద్ద రేపు మ‌ధ్యాహ్నం 3 గంట‌ల నుంచి రాత్రి 9 గంట‌ల వ‌ర‌కు ట్రాఫిక్ ఆంక్ష‌లు అమ‌ల్లో ఉండనున్నాయి. ఇక్బాల్ మీనార్ నుంచి క‌ట్ట‌మైస‌మ్మ టెంపుల్ వైపు వ‌చ్చే వాహ‌నాల‌ను తెలుగుతల్లి ఫ్లైఓవర్‌పైకి అనుమతంచకుండా.. తెలుగుతల్లి జంక్షన్ వైపు మళ్లించనున్నారు. కవాడిగూడ డీబీఆర్ మిల్స్ నుంచి లోయర్ ట్యాంక్ బండ్ రోడ్డులోని కట్టమైసమ్మ దేవాలయం వైపు ట్రాఫిక్ అనుమతించబడదు. కవాడిగూడ డీబీఆర్ మిల్స్ నుంచి వచ్చే వాహనాలను MRO కార్యాలయం వద్ద వార్త లేన్, ఇందిరా పార్క్ మీదుగా అశోక్ న‌గ‌ర్ వైపు మ‌ళ్లించ‌నున్నారు.

అంబేద్కర్ విగ్రహం నుంచి ఇందిరాపార్కు మీదుగా దోమలగూడకు వచ్చే వాహనాలను.. ఇందిరాపార్క్ జంక్షన్ వద్ద అశోక్ నగర్ కూడలి వైపు మళ్లిస్తారు. ఇక, ఆర్టీసీ క్రాస్‌రోడ్‌ నుంచి కట్టమైసమ్మ దేవాలయం వైపు వచ్చే వాహనాలను, లోయర్‌ ట్యాంక్‌బండ్‌ వైపు వెళ్లే వాహనాలను.. రిలయన్స్‌ అపార్ట్‌మెంట్‌ (రమ్య హోటల్‌) వద్ద లిబర్టీ వైపు మళ్లిస్తారు.

అంబ‌ర్‌పేట్ మ‌హంకాళి టెంపుల్ వ‌ద్ద బోనాల సందర్భంగా రేపు అంబర్‌పేట- రామంతపూర్ రూట్‌లో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగనున్నాయి. రేపు ఉదయం 6 గంటల నుంచి మంగళవారం ఉదయం 6 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. 

PREV
click me!

Recommended Stories

Constable Recruitment 2025 : 48954 పోలీస్ జాబ్స్.. తెలుగులోనే పరీక్ష, తెలుగు రాష్ట్రాల్లోనే ఎగ్జామ్ సెంటర్
Hyderabad: యువ‌త త‌ల రాత మార్చేలా.. హైద‌రాబాద్‌లో గూగుల్ తొలి స్టార్ట‌ప్స్ హ‌బ్, దీని ఉప‌యోగం ఏంటంటే