Sammakka Saralamma jatara: మేడారం జాత‌ర‌.. 400కు పైగా సీసీటీవీలు.. భారీ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ తో నిఘా !

By Mahesh Rajamoni  |  First Published Feb 13, 2022, 3:05 PM IST

Sammakka Saralamma jatara: అంతర్జాతీయ ఖ్యాతి గాంచిన అడవి తల్లుల జాత‌ర‌.. ఆసియాలోనే అతిపెద్ద గిరిజ‌న ఉత్స‌వం.. అదే  తెలంగాణ కుంభమేళాగా అభివర్ణించే సమ్మక్క సారలమ్మ జాతర. మేడారం జాత‌ర ఈ నెల (ఫిబ్రవరి) 16 నుంచి 19 వరకు ఘనంగా జరుగనుంది. దీనికోసం పోలీసులు భారీ బందోబ‌స్తును ఏర్పాటు చేస్తున్నారు. ల‌క్ష‌లాది వాహ‌నాలు వ‌స్తాయి కాబ‌ట్టి  ట్రాఫిక్ స‌మ‌స్య‌లు త‌లెత్త‌కుండా అన్ని చ‌ర్య‌లు తీసుకుంటున్నారు.
 


Sammakka Saralamma jatara: అంతర్జాతీయ ఖ్యాతి గాంచిన అడవి తల్లుల జాత‌ర‌.. ఆసియాలోనే అతిపెద్ద గిరిజ‌న ఉత్స‌వం.. అదే  తెలంగాణ (Telangana) కుంభమేళాగా అభివర్ణించే సమ్మక్క సారలమ్మ జాతర. మేడారం జాత‌ర ఈ నెల (ఫిబ్రవరి) 16 నుంచి 19 వరకు ఘనంగా జరుగనుంది. సమ్మక్క సారలమ్మ జాతర (Sammakka Saralamma jatara) లో పాల్గొనేందుకు లక్షలాది వాహనాలు మేడారం తరలిరానుండగా, వేడుకలను ఘనంగా నిర్వహించడంలో పోలీసులు ఎలాంటి ఢోకా లేకుండా చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. దీనికోసం పోలీసులు భారీ బందోబ‌స్తును ఏర్పాటు చేస్తున్నారు. ల‌క్ష‌లాది వాహ‌నాలు వ‌స్తాయి కాబ‌ట్టి  ట్రాఫిక్ స‌మ‌స్య‌లు (traffic) త‌లెత్త‌కుండా అన్ని చ‌ర్య‌లు తీసుకుంటున్నారు.

ట్రాఫిక్ మళ్లింపులు, పార్కింగ్, నేరాల నిరోధం, వీవీఐపీల సందర్శనల భద్రతకు సంబంధించి రాష్ట్ర పోలీసు అధికారులు ఇప్పటికే జిల్లా పోలీసులతో వరుస సమావేశాలు నిర్వహించారు. జాతర (Sammakka Saralamma jatara) విధుల కోసం వివిధ జిల్లాల నుంచి 9 వేల మంది పోలీసులను వినియోగిస్తున్నట్లు ఆ  రాష్ట్ర పోలీసు శాఖ ఒక  ప్రకటనలో పేర్కొంది.  ఈ సారి మేడారం స‌మ్మ‌క్క సార‌ల‌మ్మ జాత‌ర‌కు 3.5 లక్షల ప్ర‌యివేటు వాహనాలు (private vehicles), 4 వేల ఆర్టీసీ బస్సుల (RTC buses) ద్వారా దాదాపు 1.25 కోట్ల మంది  సందర్శకులు వ‌స్తార‌ని అంచనా. దీంతో వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించడంతోపాటు పార్కింగ్‌ ఏర్పాటు చేయడం పోలీసు (police) లకు సవాల్‌గా మారనుంది. అయితే, దీనిని సంబంధించిన ఇప్ప‌టికే అన్ని చ‌ర్య‌లు తీసుకున్నామ‌ని పోలీసు ఉన్న‌తాధికారులు పేర్కొంటున్నారు. 

Latest Videos

మేడారం స‌మ్మ‌క్క సార‌ల‌మ్మ జాత‌ర (Sammakka Saralamma jatara) నేప‌థ్యంలో ఆ ప్రాంతంలో 382కు పైగా సీసీటీవీలు, రెండు డ్రోన్ కెమెరాలు, 20 డిస్‌ప్లే బోర్డులు, 24 గంటలూ జాతరను పర్యవేక్షించేందుకు భారీ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. వాహనాల ప్రవాహాన్ని నియంత్రించేందుకు దాదాపు 33 పార్కింగ్ స్థలాలు, 37 వాహనాల హోల్డింగ్ పాయింట్లు కేటాయించబడ్డాయి. ప్రతి నాలుగు కిలోమీటర్లకు ఒక పోలీసు అవుట్‌పోస్టును ఏర్పాటు చేశారు. ఒక పస్రా మార్గం ( One Pasra route), ప్రతి రెండు కిలోమీటర్లకు ఒక పోలీసు ఔట్‌పోస్టును ఏర్పాటు చేసి మొబైల్ పెట్రోలింగ్ బృందాలు ప‌రిస్థితుల‌ను ప‌ర్య‌వేక్షించ‌నున్నాయి.

ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా 6 టోయింగ్ వాహనాలు, 11 క్రేన్లు, 20 జేసీబీలను మోహ‌రించారు. డిపార్ట్‌మెంట్ డ్యూటీలో ఉన్న పోలీసులందరికీ ఫేస్ మాస్క్‌లు, శానిటైజర్ కిట్‌లను కూడా పంపిణీ చేస్తుంది. భక్తులకు దిశానిర్దేశం చేసేందుకు 50కి పైగా ప్రజా సమాచార కేంద్రాలను ఏర్పాటు చేశారు. డ్రైవర్లు ఓవర్‌టేక్ చేయవద్దని, సురక్షిత ప్రయాణం కోసం వాహనాల వెనుక రేడియం స్టిక్కర్లు ఉండేలా చూడాలని జిల్లా పోలీసు సూపరింటెండెంట్ ఎస్‌ఎస్‌జీ పాటిల్ (District Superintendent of Police SSG Patil) విజ్ఞప్తి చేశారు. క‌రోనా నేప‌థ్యంలో ప్రజలు వ్యక్తిగత ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, వివిధ ప్రాంతాల్లో జాతర (Sammakka Saralamma jatara) విధుల్లో ఉన్న పోలీసుల సూచనలను పాటించాలని ఆయన కోరారు.

click me!