బ్యారేజీ కుంగినచోట పియర్స్ కు, పునాదికి ఏం జరిగిందో తెలుసుకోవడానికి అక్కడ నీళ్లు రాకుండా మళ్ళించాలని.. దానికోసం అక్కడ నీళ్లు రాకుండా మళ్ళించాలని కాపర్ డ్యాం నిర్మాణం చేపట్టాల్సి ఉంటుందని తెలిపింది. దానికి అనుబంధ ఒప్పందం చేసుకోవాలని కోరింది.
హైదరాబాద్ : మేడిగడ్డ బ్యారేజీ మరోసారి వార్తల్లో నిలిచింది. మేడిగడ్డ బ్యారేజీ లో జరిగిన నష్టాన్ని పునరుద్ధరించే పని తమది కాదని మేడిగడ్డ నిర్మాణ సంస్థ ఎలాంటి తేల్చి చెప్పింది. మేడిగడ్డలో బ్యారేజీ కుంగిపోవడం, దెబ్బతిన్న పియర్స్ ను తాము పునరుద్ధరించమని తెలిపింది. వీటి పునరుద్ధరణ పనులు చేయాలంటే దానికి అయ్యే మొత్తం ఖర్చును ప్రభుత్వమే చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది. ఈ మేరకు అనుబంధ ఒప్పందాన్ని చేసుకుంటేనే పనుల్లో ముందడుగు వేస్తామని తెలిపింది.
అయితే బ్యారేజీ కుంగిపోయిన సమయంలో నిర్వహణ గడువు ఇంకా ఉందని, ఎంల్అండ్ టీ ప్రాజెక్టు ఇంజనీర్లు అధికారికంగా పునరుద్ధరణ అయ్యే ఖర్చు మొత్తం నిర్మాణ సంస్థ భరిస్తుందని ప్రకటించారు కూడా. నిర్మాణ సంస్థ కూడా ఈ మేరకే ప్రకటన చేసింది. కానీ ఇప్పుడు దీనికి భిన్నంగా మేడిగడ్డ నిర్మాణ సంస్థ అయిన ఎల్ అండ్ టీ లేఖ రాయడం చేర్చనీయాంశంగా మారింది. దీని మీద తదుపరి చర్యలు తీసుకోవాలని సంబంధిత ఇంజనీర్ ఇన్ని చీఫ్ కిందిస్థాయి ఇంజనీర్లకు ఆ లేఖను పంపింది.
ప్రజావాణికి ఒక్కరోజే 8వేలమంది..ప్రజాభవన్ నుంచి పంజాగుట్టవరకు క్యూ లైన్..
కాళేశ్వరం ఎత్తిపోతల ఈఎన్సీ వెంకటేశ్వర్లుకు ఈనెల రెండవ తేదీన ఓ లేఖ రాసింది. మేడిగడ్డలో పునరుద్ధరణ పనుల నిర్మాణానికి రూ. 55.75 కోట్లు ఖర్చు అవుతుందని అందులో పేర్కొంది. బ్యారేజీ కుంగినచోట పియర్స్ కు, పునాదికి ఏం జరిగిందో తెలుసుకోవడానికి అక్కడ నీళ్లు రాకుండా మళ్ళించాలని.. దానికోసం అక్కడ నీళ్లు రాకుండా మళ్ళించాలని కాపర్ డ్యాం నిర్మాణం చేపట్టాల్సి ఉంటుందని తెలిపింది. దానికి అనుబంధ ఒప్పందం చేసుకోవాలని కోరింది.
డిసెంబర్ ఐదవ తేదీన ఈ లెటర్ ను సంబంధిత ఏస్ ఈకి పంపించింది. వీటి మీద అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా ఈ ఎన్సీ సూచించింది. దెబ్బతిన్న బ్లాక్ ను పియర్స్ ను పునరుద్ధరించడానికి రూ. 500 కోట్ల వరకు ఖర్చు కావచ్చని నీటిపారుదుల శాఖ ప్రాథమికంగా పేర్కొంటూ వస్తోంది. పునరుద్ధరణ పని ఏం చేయాలో తేలాలంటే నీటిని పూర్తిగా మళ్ళించాలని… అలా మళ్ళిస్తే ఏం నష్టం జరుగుతుందో తేలితేనే మొత్తం ఖర్చుపై అంచనా వస్తుందట. అక్టోబర్ 22న నిర్మాణ సంస్థ ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జారీ చేసిన ప్రకటనకు విరుద్ధంగా ఈ తాజా లేఖలు ఉండడంతో మేడిగడ్డపై మరోసారి గందరగోళం ఏర్పడింది.
ఎంల్అండ్ టీ జనరల్ మేనేజర్ సురేష్ కుమార్ రామగుండం ఈఎన్సీ వెంకటేశ్వర్లు డిసెంబర్ రెండవ తేదీన రాసిన లేఖలో పేర్కొన్న ముఖ్య విషయాలు ఏంటంటే.. ఈ ప్రాజెక్టు డిజైన్ను నీటిపారుదల శాఖ అందించింది. చేసిన పనికి తగ్గట్లుగా బిల్లు చెల్లించే పద్ధతిలో ఒప్పందం జరిగింది. 2018 ఆగస్టు 25న పని పూర్తి చేయాల్సి ఉంది. కానీ 2020 జూన్ 29 నాటికి పని పూర్తయింది. మొదట ఈ పని కోసం ఒప్పందం రూ. 3062.79 కోట్లకు ఒప్పందం జరిగింది. అయితే పని పూర్తయ్య నాటికి టెండర్ విలువ కంటే రెండు పాయింట్ ఏడు శాతం ఎక్కువగా కోర్టు చేయడంతో.. ధరలు పెరగడంతో అవన్నీటిని పరిగణలోకి తీసుకొని గుత్తేదారుకు మొత్తంగా రూ. 3.348.24 కోట్లు చెల్లించారు.
2021 మార్చి 15న ఒప్పందం ప్రకారం పని పూర్తయినట్లుగా సంబంధిత ఎస్సీ ధృవీకరణ పత్రం ఇచ్చారు. అగ్రిమెంట్ ప్రకారం సివిల్ పనులకు డిఫెక్ట్ లైబులిటీ పీరియడ్ 24 నెలలు. 2020 జూన్ 29 నుంచి 2022 జూన్ 29 వరకు ఈ డిఫెక్ట్ లైబులిటీ పీరియడ్ గా ఉంటుంది. అధికారులు కూడా 2021 మార్చి 15న పని పూర్తయి స్వాధీనం చేసుకున్నట్లుగా ధ్రువీకరణ పత్రం ఇచ్చారు. ఈ వివరాలన్నీ పేర్కొంటూ దీనికి సంబంధించిన ఆధారాలు అన్ని లెటర్ కు జత చేశారు.
గత అక్టోబర్ 25వ తేదీన నవంబర్ 25వ తేదీన లెటర్ల ఆధారంగా కొత్త పని మొదలు పెట్టాలంటే మళ్ళీ ప్రత్యేక ఒప్పందం చేసుకోవాలని…ఇది కూడా ఇద్దరి మధ్య పరస్పర అవగాహనతో అనిఎల్&టి దీంట్లో పేర్కొంది. కాపర్ డ్యాం నిర్మాణానికి జీఎస్టీ, సీవరేజీ చార్జీలు కాకుండా రూ.55.75 కోట్లు ఖర్చు అవుతుందని తెలిపింది. నిర్మాణ సమయంలో మెటీరియల్ దొరికే అవకాశాలు, ధరల పెరుగుదల కూడా దీనికి వర్తిస్తాయని తెలిపింది.