పల్లా వెనక్కి: సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా కూనంనేని సాంబశివరావు

By narsimha lode  |  First Published Sep 8, 2022, 9:56 AM IST

సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఎన్నికయ్యారు. ఈ పదవికి పోటీ జరిగింది. పల్లా వెంకట్ రెడ్డి కంటే కూనంనేని సాంబశివరావుకు ఎక్కువ ఓట్లు వచ్చాయి. దీంతో కూనంనేని సాంబశివరావును పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నుకున్నారు.


హైదరాబాద్: సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా కూనంనేని సాంబశివరావు  ఎన్నికయ్యారు.రాష్ట్ర కార్యదర్శి పదవికి కూనంనేని సాంబశివరావు, పల్లా వెంకట్ రెడ్డిలు పోటీ పడ్డారు. అయితే చివరికి కూనంనేని సాంబశివరావు సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికయ్యారు. రాష్ట్ర కార్యదర్శి పదవి కోసం పల్లా వెంకట్ రెడ్డి, కూనంనేని సాంబశివరావు పోటీ పడడంతో ఎన్నిక నిర్వహించారు. బుధవారం నాడు రాత్రి ఓటింగ్ ద్వారా రాష్ట్ర కార్యదర్శిని ఎన్నుకున్నారు.

సీపీఐ రాష్ట్ర మహసభలు  శంషాబాద్ లో జరుగుతున్నాయి. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, భవిష్యత్తులో అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సమావేశాల్లో చర్చించారు. మహసభల ముగింపును పురస్కరించుకొని రాష్ట్ర సమితి కార్యదర్శిని ఎన్నుకొంటారు. అయితే రాష్ట్ర కార్యదర్శి పదవికి కూనంనేని సాంబశివరావు, పల్లా వెంకట్ రెడ్డిలు పోటీపడ్డారు. రాష్ట్ర సమితి కార్యదర్శి పదవిని ఏకగ్రీవంగా ఎంపిక చేయాలని పార్టీ నాయకత్వం భావించింది. అయితే పోటీ నుండి తప్పుకొనేందుకు ఇద్దరు నేతలు అంగీకరించలేదు. దీంతో పోటీ అనివార్యమైంది. బుధవారం నాడు మధ్యాహ్నం మూడు గంటలకు పూర్తి కావాల్సిన సీపీఐ రాష్ట్ర సమితి కార్యదర్శి  ఎన్నికలు రాత్రి వరకు కొనసాగాయి. ఓటింగ్ ద్వారా రాష్ట్ర సమితి కార్యదర్శిని ఎన్నుకొన్నారు.

Latest Videos

undefined

కూనంనేని సాంబశివరావుకు 59 ఓట్లు, పల్లా వెంకట్ రెడ్డికి 45  ఓట్లు వచ్చాయి. దీంతో కూనంనేని సాంబశివరావును పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా మహసభలు ప్రకటించాయి. తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా ఇప్పటివరకు చాడ వెంకట్ రెడ్డి కొనసాగారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత చాడ వెంకట్ రెడ్డి పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా కొనసాగుతున్నారు. పార్టీ నియామావళి ప్రకారంగా మూడు దఫాలు పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా కొనసాగే అవకాశం ఉంది. ఈ దఫా మాత్రం తాను రాష్ట్ర కార్యదర్శిని పదవిని చేపడుతానని కూనంనేని సాంబశివరావు తేల్చి చెప్పారు.

also read:నేడే సీపీఐ తెలంగాణ రాష్ట్రసమితి కార్యదర్శి ఎన్నిక: పల్లా వెంకట్ రెడ్డి, కూనంనేని మధ్య తీవ్ర పోటీ

అయితే పల్లా వెంకట్ రెడ్డి కూడా ఈ పదవి విషయమై పట్టుబట్టారు. దీంతో ఎన్నిక అనివార్యమైంది. చాడ వెంకట్ రెడ్డి కూడా మూడో దఫా  కార్యదర్శిగా పనిచేసేందుకు ఆసక్తిగా ఉన్నారు. అయితే ఏకగ్రీవంగా ఎన్నుకొంటేనే తాను ఈ పదవిని చేపడుతానని చాడ వెంకట్ రెడ్డి చెప్పారని సమాచారం.రాష్ట్ర కార్యదర్శి పదవికి కూనంనేని సాంబశివరావు ఆసక్తి చూపడంతో చాడ వెంకట్ రెడ్డి  వెనక్కి తగ్గారని తెలుస్తుంది. ఇదే సమయంలో పల్లా వెంకట్ రెడ్డి కూడా రాష్ట్ర కార్యదర్శి పదవిపై ఆసక్తిని చూపారు. ఈ ఇద్దరూ కూడా పోటీ నుండి వెనక్కు తగ్గకపోవడంతో  ఓటింగ్ నిర్వహించాల్సి వచ్చింది.
 

click me!