ఈడీ నోటీసుల నేపథ్యంలో ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. నేడు ఆమె పిటిషన్ విచారణకు రానుంది.
హైదరాబాద్ : ఎమ్మెల్సీ కవిత ఈ రోజు ఈడీ విచారణకు హాజరు కావాలంటూ గురువారం నోటీసులు పంపిన సంగతి తెలిసిందే. ఈ నోటీసులను కవిత సుప్రీం కోర్టులో సవాల్ చేశారు. గతంలో దాఖలు చేసిన పిటిషన్ లో IA దాఖలు చేశారు కవిత. సుప్రీంలో కేసు పెండింగ్లో ఉండగా నోటీసులు ఎలా ఇస్తారని కవిత ప్రశ్నించారు. ధర్మాసనం నళిని చిదంబరం, కవిత పిటిషన్ లను కలిపి విచారిస్తుంది. ఈ రోజు సుప్రీంలో కవిత పిటిషన్ విచారణకు రానుంది.
సంజయ్ కిషన్ కౌర్ నేతృత్వంలోని బెంచ్ కవిత పిటిషన్ ను విచారించనుంది. కవిత తరఫున విక్రమ్ చౌదరి వాదనలు వినిపించనున్నారు. కాగా సుప్రీంలో విచారణలో ఉండగా తాను విచారణకు హాజరుకాబోనని కవిత ప్రకటించింది. అంతేకాకుండా..
మహిళను ఈడీ ఆఫీసుకు పిలిచి విచారించడాన్ని సవాల్ చేసిన కవిత. తనపై ఈడీ ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆదేశించాలని సుప్రీంను కవిత కోరారు. ఈడీ నోటీసుల నేపథ్యంలో ఈ రోజు కామారెడ్డి పర్యటనను కవిత రద్దు చేసుకున్నారు.