తెలంగాణ సీఎం కేసీఆర్ కాన్వాయ్ ను అడ్డుకొనేందుకు కాకతీయ విశ్వవిద్యాలయం జేఎసీ విద్యార్థులు సోమవారం నాడు ప్రయత్నించారు.
వరంగల్: తెలంగాణ సీఎం కేసీఆర్ కాన్వాయ్ ను అడ్డుకొనేందుకు కాకతీయ విశ్వవిద్యాలయం జేఎసీ విద్యార్థులు సోమవారం నాడు ప్రయత్నించారు. పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొనేందుకు సీఎం కేసీఆర్ వరంగల్ కు కేసీఆర్ వచ్చారు. వరంగల్ లో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి భవనానికి శంకుస్థాపన చేసి కొత్త కలెక్టరేట్ భవన సముదాయాన్ని ప్రారంభించేందుకు సీఎం కేసీఆర్ వెళ్తున్న సమయంలో కాకతీయ యూనివర్శిటీ జేఎసీ విద్యార్థులు అడ్డుకొనే ప్రయత్నం చేశారు.
also read:జూలై 1 నుండి 10 వరకు పల్లె ప్రగతి: కేసీఆర్
సీఎం కాన్వాయ్ కు అడ్డుపడేందుకు విద్యార్థులు ఒక్కసారిగా రోడ్డుపైకి వచ్చి నిరసన చేపట్టారు. ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయాలని విద్యార్థులు నినాదాలు చేశారు. అయితే విద్యార్థులను పోలీసులు అడ్డుకొన్నారు. సీఎం కాన్వాయ్ ను అడ్డుకొనేందుకు ప్రయత్నించిన విద్యార్థి నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. వరంగల్ లో కాళోజీ యూనివర్శిటీ కొత్త భవనం తో పాటు నూతన కలెక్టరేట్ కార్యాలయాలను సీఎం ఇవాళ ప్రారంభించారు.