మాజీ మంత్రి, బీఆర్ఎస్ (BRS)వర్కింగ్ ప్రెసిండెంట్ కేటీఆర్ (KTR) తాజాగా చేసిన ట్వీట్ (KTR Tweet) పొలిటికల్ సర్కిల్ హాట్ టాపిక్ (hot topic in political circle)గా మారింది. దేశమంతా గణతంత్ర దినోత్సవ వేడుకలు (republic day 2024) జరుపుకుంటున్న సమయంలో ఈ ట్వీట్ ప్రాధాన్యత సంతరించుకుంది.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సంచలన ట్వీట్ చేశారు. ఇది ఇప్పుడు పొలిటికల్ సర్కిల్ లో హాట్ టాపిక్ గా మారింది. దేశం మొత్తం గణతంత్ర వేడుకలు జరుపుకుంటోంది. తెలంగాణలో కూడా ఈ వేడుకలు జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా హైదరాబాద్ లోని నాంపల్లి పబ్లిక్ గార్డెల్ లో జాతీయ జెండా ఆవిష్కరించి, గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహిస్తోంది. ఈ క్రమంలో కేటీఆర్ ట్విట్టర్ లో చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
రైతులకు గుడ్ న్యూస్.. రూ. 2 లక్షల రుణ మాఫీపై తెలంగాణ గవర్నర్ కీలక ప్రకటన..
undefined
ఇంతకీ ఆ ట్వీట్ లో ఏముందంటే.. ?
మాజీ మంత్రి కేటీఆర్ శుక్రవారం ఉదయం తన ట్విట్టర్ హ్యాండిల్ లో ఓ సుమతి శతకాన్ని పోస్ట్ చేశారు. దానికి పెద్ద వాళ్లు ఎప్పుడో చెప్పారంటూ క్యాప్షన్ పెట్టారు. ఆ పోస్ట్ లో ‘కనకపు సింహాసనమున శునకమును గూర్చుండబెట్టి ’ అనే పద్యం పుస్తకంలో కనిపిస్తోంది. అయితే ఈ ట్వీట్ ఎవరిని ఉద్దేశించి చేశారో అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. రాజకీయ వర్గాల్లో కూడా దీనిపై చర్చ జరుగుతోంది.
పెద్దవాళ్ళు ఎప్పుడో చెప్పారు 👇 pic.twitter.com/G1Xl7AEeHt
— KTR (@KTRBRS)కాగా.. గత కొన్ని రోజుల నుంచి కాంగ్రెస్, బీఆర్ఎస్ ల మధ్య మాటల యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో కూడా ఇరు పార్టీల నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఇటీవల కేటీఆర్.. సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ‘గుంపు మేస్త్రీ’ అన్నారు. దానికి రేవంత్ రెడ్డి కూడా కౌంటర్ ఇచ్చారు. ఈ క్రమంలో కేటీఆర్ ట్వీట్ చేయడం.. అందులో పరోక్షంగా ముఖ్యమైన పదవిని ఉద్దేశించి ఉండటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.