
ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎంఎల్సీలు ఇతర ప్రజాప్రతినిధులు అందరూ చేనేత వస్త్రాలు ధరించాలని మంత్రి కేటీఆర్ ఒక లేఖలో కోరారు.
చేనేత వస్ర్తాలకు, నేతన్నలకు చేయూత నిచ్చేందుకు ప్రభుత్వం ఇప్పటికే అనేక కార్యక్రమాలు చేపట్టిందని తెలిపారు.
ఇకపై ప్రజాప్రతినిధులు, వారి సిబ్బంది చేనేత వస్ర్తాలు ధరించేలా చూడాలని కోరారు.
భారతీయ సంప్రదాయానికి చేనేత ప్రతీక అని కొనియాడారు.
తెలంగాణ గడ్డపై పుట్టిన ఎందరో నేతన్నలు ప్రపంచ స్థాయిలో పేరు ప్రఖ్యాతలు పొందారని గుర్తు చేశారు.
నారాయణ పేట వస్త్రాల నాజూకుతనం , గద్వాల వస్త్రాల ఘనతను దశదిశలా చాటారని గుర్తు చేశారు.