ముస్లింలపై కేసీఆర్ ది మొసలి కన్నీరు

First Published Dec 22, 2016, 2:21 PM IST
Highlights
  • కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ విమర్శ
  • మైనారిటీలకు భారీ బడ్జెట్ కేటాయింపు ఓ గిమ్మిక్ మాత్రమే
  • కేటాయింపులలో 30 శాతం కూడా ఖర్చు చేయలేదు

 

ముస్లింలపై కేసీఆర్ సర్కార్ సవతితల్లి ప్రేమను చూపుతోందని కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ విమర్శించారు. మైనారిటీల సంక్షేమం పట్టించుకోకుండా వారిపట్ల మొసలి కన్నీరు కారుస్తోందని ధ్వజమెత్తారు.

 

ఈ రోజు అసెంబ్లీ సెషన్ లో ఆయన మాట్లాడుతూ.... మైనారిటీలపై సర్కారు వ్యవహరిస్తున్న తీరును ఎండగట్టారు.
 

 మైనారిటీలకు బడ్జెట్ లో భారీ మొత్తం కేటాయించినట్లు ప్రభుత్వం చెబుతోందని కానీ, డిసెంబర్ వరకు కేటాయించిన మొత్తంలో కేవలం 30 శాతం మాత్రమే ఖర్చు చేశారని వెల్లడించారు.

 

మైనారిటీల సంక్షేమానికి భారీగా బడ్జెట్ కేటాయించినట్లు చెబుతున్న ప్రభుత్వానిది కేవలం అంకెల గారెడీ మాత్రమేనని విమర్శించారు.

 

మైనారిటీల సంక్షేమానికి రూ. 636 కోట్లు విడుదల చేస్తే కేవలం రూ. 270 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని, ఇంకా రూ. 249 కోట్లను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

 

షాదీ ముబారక్ పథకం వల్ల మైనారిటీలకు పెద్దగా ఒరిగిందేమీ లేదన్నారు. దీనిపై ప్రభుత్వం రూ. 150 కోట్లు ఖర్చు పెట్టనున్నట్లు ప్రకటించిందని అయితే ఇప్పటివరకు కేవలం రూ. 21 కోట్లు మాత్రమే విడుదల చేశారని తెలిపారు.
 

 

విద్యార్థుల స్కాలర్ షిప్ బకాయిలు కూడా ఇంకా విడుదల చేయలేదని విమర్శించారు.

click me!