అంబేద్కర్ వల్లే తెలంగాణ ఏర్పాటు: కేటీఆర్

By narsimha lode  |  First Published Apr 14, 2023, 2:21 PM IST

పంజాగుట్టలో  అంబేద్కర్ విగ్రహన్ని తెలంగాణ మంత్రి కేటీఆర్  ఆవిష్కరించారు.  అంబేద్కర్  రాసిన  రాజ్యాంగం  వల్లే  తెలంగాణ  రాష్ట్రం సాకారమైందని  మంత్రి కేటీఆర్  చెప్పారు.



హైదరాబాద్:  అంబేద్కర్ లేకపోతే  తెలంగాణ లేనేలేదని  తెలంగాణ  రాష్ట్ర  ఐటీ శాఖ మంత్రి  కేటీఆర్  అభిప్రాయపడ్డారు.  హైద్రాబాద్   పంజాగుట్టలో  అంబేద్కర్ విగ్రహన్ని  మంత్రి  కేటీఆర్  శుక్రవారంనాడు  ఆవిష్కరించారు. 

గతంలో  పంజాగుట్టలో  ఉన్న అంబేద్కర్ విగ్రహన్ని  జీహెచ్ఎంసీ అధికారులు తొలగించారు.  ఇవాళ  పంజాగుట్టలో  అంబేద్కర్ విగ్రహన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు  చేసింది.  ఈ సందర్భంగా  నిర్వహించిన  కార్యక్రమంలో  మంత్రి కేటీఆర్ ప్రసంగించారు.అంబేద్కర్ రాసిన  రాజ్యాంగం వల్లే  తెలంగాణ ఏర్పాటు  సాధ్యమైందని కేటీఆర్  చెప్పారు. దళితబబంధు  సాహసోపేతమైన  నిర్ణయం.గా  ఆయన  పేర్కొన్నారు.  సచివాలయానికి  అంబేద్కర్ పేరు పెట్టడం  కేసీఆర్ కే సాధ్యమైందన్నారు. సీఎం కేసీఆర్ దమ్మున్న నేత. అన్నారు. అందుకే  కేసీఆర్  రాష్ట్ర ప్రజలకు  అవసరమైన  నిర్ణయాలను కేసీఆర్ తీసుకుంటున్నారని  ఆయన  గుర్తు  చేశారు.  కొత్త పార్లమెంట్ కు  కూడా  అంబేద్కర్ పేరు పెట్టాలని  ఆయన  డిమాండ్  చేశారు.   పంజాగుట్ట  చౌరస్తాకు  అంబేద్కర్  పేరు పెడతామని కేటీఆర్  చెప్పారు. 

Latest Videos

undefined

పంజాగుట్టలో  అంబేద్కర్  విగ్రహన్ని ఏర్పాటు  చేయాలని  కోరుతూ  హైద్రాబాద్ తో  పాటు   న్యూఢిల్లీలో  కూడా  వి. హనుమంతరావు ఆందోళన  నిర్వహించారు.   అంబేద్కర్  జయంతి,  వర్ధంతుల సమయంలో   పంజాగుట్టలో  విగ్రహం  ఏర్పాటు  చేయాలని వి. హనుమంతరావు  ఆంోళనలు  నిర్వహించారు. 

ప్రపంచంలోనే  అతి  ఎత్తైన  అంబేద్కర్ విగ్రహన్ని  కూడా  హైద్రాబాద్ లో  ఆవిష్కరించనున్నారు.  ఇవాళ  కేసీఆర్  ఈ విగ్రహన్ని ఆవిష్కరిస్తారు.   హైద్రాబాద్ ట్యాంక్ బండ్  వద్ద అంబేద్కర్ విగ్రహన్ని  ఏర్పాటు  చేసింది  తెలంగాణ  ప్రభుత్వం.

tags
click me!