పెళ్లినాటి భార్య ఫొటో షేర్ చేసిన కేటీఆర్.. ఏం చెప్పారంటే...

Published : Dec 19, 2023, 11:13 AM IST
పెళ్లినాటి భార్య ఫొటో షేర్ చేసిన కేటీఆర్.. ఏం చెప్పారంటే...

సారాంశం

గత 2 దశాబ్దాలుగా నాకు వెన్నుదన్నుగా నిలిచినందుకు, నాకు ఇద్దరు అందమైన పిల్లలను అందించినందుకు.. నా ఈ ప్రయాణంలో గొప్ప భాగస్వామిగా ఉన్నందుకు ధన్యవాదాలు. అంటూ ఎక్స్ లో ట్వీట్ చేశారు.   

హైదరాబాద్ : సిరిసిల్ల ఎమ్మెల్యే, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సోమవారం అంటే డిసెంబర్ 18వ తేదీ కేటీఆర్  పెళ్లి రోజు. ఆ రోజును పురస్కరించుకొని కేటీఆర్ ఎక్స్ లో ఓ ఫోటోను షేర్ చేశాడు.  అది వారి పెళ్లినాటి ఫోటో. 20 ఏళ్ల క్రిందటి ఫోటోను షేర్ చేస్తూ.. ‘నా అందమైన భార్య శైలిమకు 20వ వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు.

గత 2 దశాబ్దాలుగా నాకు వెన్నుదన్నుగా నిలిచినందుకు, నాకు ఇద్దరు అందమైన పిల్లలను అందించినందుకు.. నా ఈ ప్రయాణంలో గొప్ప భాగస్వామిగా ఉన్నందుకు ధన్యవాదాలు. ఇంకా చాలా యేళ్లు కలిసి ప్రయాణించాల్సి ఉంది’ అంటూ ఎక్స్ లో ట్వీట్ చేశారు. 

డిల్లీకి పయనమైన రేవంత్ రెడ్డి ... ప్రధాని మోదీతో భేటీకి ఛాన్స్?

ఫోటోతోపాటు భార్యా పిల్లలతో ఉన్న మరో ఫోటోను కూడా కేటీఆర్ షేర్ చేశారు. దీనిపై కేటీఆర్ అభిమానులు పెద్ద సంఖ్యలో స్పందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.  హిమాన్షు కూడా  తన ఎక్స్ అకౌంట్లో  తల్లిదండ్రులకు  వివాహ శుభాకాంక్షలు తెలిపాడు. అందులో  హిమాన్షు.. ‘మీరిద్దరూ నా తల్లిదండ్రులుగా ఉండడం నా అదృష్టం. అమ్మానాన్నలు ఇద్దరికీ 20వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. మీరు నాకు ఇచ్చిన ప్రతి దానికి ధన్యవాదాలు. ఐ లవ్ యు వెరీ మచ్’ అంటూ  పోస్ట్ చేశాడు.

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో టెంపరేచర్స్ కుప్పకూలడానికి .. చలి బీభత్సానికి కారణమేంటో తెలుసా?
Telangana Rising Global Summit: రూ.5.75 లక్షల కోట్ల భారీ ఒప్పందాలు.. ప్రపంచ దిగ్గజ సంస్థల క్యూ !