ఇద్దరు హైదరాబాదీలం కలిశాం.. బిజినెస్, బిర్యానీల గురించి మాట్లాడుకున్నాం.. కేటీఆర్ ట్వీట్..

Published : Jan 06, 2023, 12:22 PM IST
ఇద్దరు హైదరాబాదీలం కలిశాం.. బిజినెస్, బిర్యానీల గురించి మాట్లాడుకున్నాం.. కేటీఆర్ ట్వీట్..

సారాంశం

ఇద్దరు హైదరాబాదీలు కలవడంతో ఈ రోజు చక్కగా ప్రారంభమయ్యింది అంటూ సత్యనాదెళ్లతో కలవడం గురించి కేటీఆర్ ట్వీట్ చేశారు. 

హైదరాబాద్ : భారత్ లో నాలుగు రోజుల పర్యటనకు వచ్చిన మైక్రోసాఫ్ట్ సీఈవో, చైర్మన్ సత్య నాదెళ్లను తెలంగాణ ఐటీ, పారిశ్రామిక శాఖ మంత్రి కేటీఆర్ కలిశారు. ఈ మేరకు ఆయన సత్యానాదెళ్లతో ఉన్న ఫొటోను ట్విట్టర్ లో షేర్ చేశారు.

కొత్త సంవత్సరంలో ఈరోజుకు ఇదో మంచి ప్రారంభం.. ఇద్దరు హైదరాబాదీలం కలిశాం. బిజినెస్ గురించి బిర్యానీ గురించి.. చాలా మాట్లాడుకున్నాం... అంటూ ట్వీట్ చేశారు. 

బీఆర్ఎస్‌లో చేరిన 12 మంది ఎమ్మెల్యేలు: మొయినాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేయనున్న కాంగ్రెస్

ఇక సత్య నాదేళ్ల తన భారత్ టూర్ లో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. కేంద్ర ప్రభుత్వం డిజిటల్ ఇండియా లక్ష్యాన్ని సాధించేందుకు చేస్తున్న కృషిని మెచ్చకున్నారు. సమావేశం తరువాత ట్విట్టర్ లో దీనికి సంబంధించిన వివరాలు సత్యనాదెళ్ల పోస్ట్ చేశారు.. 

‘థ్యాంక్యూ నరేంద్ర మోదీ జీ. కేంద్ర ప్రభుత్వం డిజిటలీకరణ మద్ధతుతో నిలకడతో కూడిన ఆర్థికాభివృద్ధి సాధించేందుకు చాలా శ్రద్ధ చూపుతుంది. ఇది స్పూర్తి దాయకం. డిజిటల్ ఇండియా విజన్ తో ప్రపంచానికి మార్గదర్శకంగా భారత్ మారే కలను సాకారం చేసుకోవడానికి మైక్రోసాఫ్ట్ సాయపడుతుంది’ అని చెప్పుకొచ్చారు. 

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఈ ఐద్రోజులు అల్లకల్లోలమే... ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్
Hyderabad వైపు ట్రంప్ చూపు.. ఈ ప్రాంతం మరో కోకాపేట్ కావడం ఖాయం...!