వ్యవసాయ, ఉద్యాన విశ్వవిద్యాలయాల స్థలాలను హైకోర్టు నిర్మాణానికి ఇవ్వకూదంటూ ఆందోళన చేస్తున్న ఏబీవీపీ నాయకురాలిపై మహిళా పోలీసులు దురుసుగా ప్రవర్తించారు (ABVP State Secretary Jhansi was dragged by the hair by the women police). ఆమెను స్కూటీపై వెంబడించి, జుట్టుపట్టుకొని లాగారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ (video viral) అవుతోంది.
ఏబీవీపీ నాయకురాలిపై మహిళా పోలీసు కానిస్టేబుల్స్ అనుచితంగా ప్రవర్తించారు. సాటి మహిళ అని కూడా చూడకుండా ఆమెను స్కూటీపై వెంబడించి జుట్టు పట్టుకొని లాగారు. దీంతో ఆమె కింద పడిపోయింది. ఈ ఘటనలో ఆ యువతికి గాయాలు అయ్యాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే దీనిపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఫైర్ అయ్యారు.
రైతు బంధు పడలేదన్న వారిని చెప్పుతో కొట్టండి.. కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్యలు వైరల్
undefined
అసలేం జరిగిందంటే.. ?
తెలంగాణ ప్రభుత్వం కొత్త హైకోర్టు నిర్మాణం కోసం వ్యవసాయ, ఉద్యాన విశ్వవిద్యాలయాల స్థలాలను కేటాయించకూడదని కొంత కాలం నుంచి విద్యార్థులు ధర్నా నిర్వహిస్తున్నారు. అయితే ఈ ఆందోళనకు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) బుధవారం మద్దతు ప్రకటించింది. అందులో భాగంగా రాజేంద్రనగర్‌లోని వర్సిటీ ప్రాంతంలో పెద్ద ఎత్తున్న విద్యార్థులు, ఏబీవీపీ కార్యకర్తలు ధర్నా నిర్వహించారు.
The recent incident involving Telangana police is deeply concerning and absolutely unacceptable. Dragging a peaceful student protester and unleashing abrasive behaviour on the protestor raises serious questions about the need for such aggressive tactics by the police.
This… pic.twitter.com/p3DH812ZBS
ఇదే సమయంలో అక్కడికి పోలీసులు చేరుకున్నారు. ఆందోళన నిర్వహిస్తున్న ఏబీవీపీ నాయకులను ఓ వ్యాన్ లో రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. అయితే ఈ ఆందోళనలో పాల్గొన్న ఏబీవీపీ రాష్ట్ర సెక్రటరీ ఝాన్సీ పోలీసుల నుంచి తప్పించునేందుకు ప్రయత్నించింది. వారి నుంచి పారిపోతుండగా.. ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు ఆమెను స్కూటీపై వెంబడించారు. కొంత దూరం వెళ్లిన తరువాత స్కూటీ వెనకాల కూర్చున ఓ మహిళా కానిస్టేబుల్ ఝాన్సీని జుట్టుపట్టుకొని లాగింది.
రూ.2, రూ.5 కాయిన్లు ఉంటే లక్షాధికారులు.. సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఏం చెప్పిందంటే..?
అనుకోని ఈ పరిణామానికి ఆమె కింద పడిపోయింది. అలాగే స్కూటీ కొంత ముందుకు వెళ్లి ఆగిపోయింది. ఈ ఘర్షణలో ఝాన్సీకి గాయాలు అయ్యాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్ ‘ఎక్స్’లో ఆమె పోలీసుల తీరుపై మండిపడ్డారు. ఇలాంటివి ప్రజాస్వామ్యంలో ఆమోదయోగ్యం కాదని తెలిపారు. ఇదేనా ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే అని అన్నారు.