తెలంగాణ‌లో కూడా అలాగే సమాధానం ఇవ్వాలేమో?: కన్నడ నటుడి అరెస్ట్‌ వార్తపై కేటీఆర్ ట్వీట్

Published : Mar 22, 2023, 02:45 PM IST
తెలంగాణ‌లో కూడా అలాగే సమాధానం ఇవ్వాలేమో?: కన్నడ  నటుడి అరెస్ట్‌ వార్తపై కేటీఆర్ ట్వీట్

సారాంశం

బీజేపీ అధికారంలో ఉన్న కర్ణాటకలో ‘ఆక్షేపణీయ’ ట్వీట్‌కు 14 రోజుల జైలు శిక్ష విధించారని తెలంగాణ మంత్రి కేటీఆర్ చెప్పారు

తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్.. బీజేపీపై పరోక్షంగా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. క‌న్న‌డ న‌టుడు చేతన్‌ను అరెస్టు చేసి 14 రోజులు రిమాండ్‌కు త‌ర‌లించిన వార్తపై స్పందించిన కేటీఆర్.. బీజేపీ అధికారంలో ఉన్న కర్ణాటకలో ‘ఆక్షేపణీయ’ ట్వీట్‌కు 14 రోజుల జైలు శిక్ష విధించారని చెప్పారు. తెలంగాణలో ముఖ్యమంత్రి, మంత్రులను, శాసనసభ్యులను ప్రత్యక్షంగా, ఘోరంగా అవమానిస్తే సహిస్తున్నామని పేర్కొన్నారు. తెలంగాణ‌లో కూడా కర్ణాటక త‌ర‌హాలో స‌మాధానం ఇవ్వాలేమోన‌ని కేటీఆర్ వ్యాఖ్యానించారు. దీనిపై మీరేమంటారు..? అని ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి కేటీఆర్ ట్వీట్ చేశారు. భావ ప్ర‌క‌ట‌నా స్వేచ్ఛ‌ అంటే అబ్యూస్ చేసే హక్కు కాకూడ‌ద‌ని కేటీఆర్ పేర్కొన్నారు.

Also Read: హిందుత్వపై అభ్యంతరకర ట్వీట్.. కన్నడ నటుడు చేతన్ కుమార్ అరెస్టు.. ఏమని ట్వీట్ చేశాడంటే?

ఇదిలా ఉంటే.. ఇంటర్ పోల్ రెడ్ నోటీసు డేటాబేస్ నుంచి వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీని తొలగించడంపై స్పందించిన కేటీఆర్.. బీజేపీపై విమర్శలు గుప్పిస్తూ ట్వీట్ చేశారు. గుజరాత్‌లోని మోసగాళ్లందరికీ ప్రత్యేక మినహాయింపు ఉందా? అని ప్రశ్నించారు. ‘‘మెహుల్ చోక్సీ భాయ్’’ రాజా సత్య హరిశ్చంద్ర మరొక కజిన్ అంటూ విమర్శించారు. మెహుల్ చోక్సీ భాయ్ కేవలం రూ. 13,500 కోట్ల చిన్న బ్యాంకు మోసానికి పాల్పడ్డాడని సెటైర్లు వేశారు. 

 


అతడికి స్కాట్-ఫ్రీగా (ఎటువంటి శిక్ష లేకుండా) ప్రయాణించడానికి అనుమతిస్తూ ఎన్‌వోసీ కూడా ఇచ్చారని ఎద్దేవా చేశారు. #ModiHaiTohMumkinHai (మోదీ ఉంటేనే అది సాధ్యం), #AMitrKaal అనే హ్యాష్ ట్యాగ్‌లు కూడా తన ట్వీట్‌కు జతచేశారు. 

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Telangana Rains : తెలంగాణలో వర్షాలు.. సంక్రాంతి పండగవేళ వాతావరణం ఎలా ఉంటుందంటే...
CP Sajjanar Serious On Journalist: ఎక్కడున్నా తీసుకొస్తా… ఇన్వెస్టిగేట్ చేస్తా | Asianet News Telugu