ఒక్క ఛాన్స్ ఇస్తే ఏం చేస్తారు:: బెల్లంపల్లిలో రేవంత్ పై కేటీఆర్ ఫైర్

By narsimha lode  |  First Published May 8, 2023, 3:44 PM IST

కాంగ్రెస్ కు అధికారం ఇస్తే  ఏం చేస్తుందని  తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు.  దేశాన్ని సుధీర్ఘకాలం పాటు  పాలించిన  కాంగ్రెస్  ప్రజలకు  ఏం చేసిందని  ఆయన  ప్రశ్నించారు. 
 



బెల్లంపల్లి: కాంగ్రెస్ కొనఊపిరితో ఉందని  తెలంగాణ మంత్రి కేటీఆర్  చెప్పారు.  ఐసీయూలో ఉన్న కాంగ్రెస్ ను ఎవరూ బతికించలేరన్నారు.సోమవారంనాడు బెల్లంపల్లిలో  నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో  తెలంగాణ మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఒక్క ఛాన్స్ ఇవ్వాలని  రేవంత్ రెడ్డి  కోరుతున్నాడన్నారు.  ఒక్క చాన్స్ ఇస్తే  కాంగ్రెస్ ఏం చేస్తుందని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలనలో  ఏం జరిగిందో  మర్చిపోయారా అని  ఆయన  ప్రజలను  ప్రశ్నించారు.  కాంగ్రెస్ పార్టీ  దేశాన్ని, రాష్ట్రాన్ని ఏళ్ల తరబడి పాలించిందన్నారు. కానీ,  ప్రజల జీవితాల్లో ఏమైనా మార్పులు వచ్చాయా అని కేటీఆర్ అడిగారు. 

తమను గెలిపిస్తే  నల్ల ధనం  పేదల  ఖాతాల్లో రూ. 15 లక్షలు జమ చేస్తానని  ఇచ్చిన  హామీని మోడీ అమలు చేశారా అని  కేటీఆర్ ప్రశ్నించారు. తన స్నేహితుడు అదానీ కోసమే పనిచేస్తున్నాడని కేటీఆర్ విమర్శించాడు.  50వ స్థానంలో ఉన్న అదానీని ప్రపంచంలో  నెంబర్ వన్ స్థానానికి తీసుకురావడంలో మోడీ  పనిచేశాడన్నారు. కానీ  తనను గెలిపించిన ప్రజలకు  ఏం చేశాడని  కేటీఆర్ ప్రశ్నించారు. 

Latest Videos

 బెల్లంపల్లిలో  350  ఎకరాల్లో ఆహార శుద్ది పరిశ్రమను  ఏర్పాటు  చేయనున్నట్టుగా మంత్రి కేటీఆర్ ప్రకటించారురూ. 2 వేల కోట్లతో సిమెంట్  పరిశ్రమ విస్తరణ పనులు  చేపట్టినట్టుగా  కేటీఆర్  తెలిపారు. 

. బెల్లంపల్లిలో  యువతకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు గాను  స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ ను ప్రారంభిస్తామని  కేటీఆర్ హామీ ఇచ్చారు.  బెల్లంపల్లిలో  నిర్వహించిన  అభివృద్ది  కార్యక్రమాలను  గురించి  కేటీఆర్ ఈ  సందర్భంగా వివరించారు. 

ఇంటింటికి  తాగు నీరు ఇచ్చేంందుు  మిషన్ భగీరథ  పనులు చేపట్టినట్టుగా  ఆయన  గుర్తు  చేశారు. మరోసారి తెలంగాణలో  కేసీఆర్  సర్కార్ ను గెలిపిస్తే  బెల్లంపల్లి  ప్రజల సమస్యలన్నీ  తీరుస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు.  ప్రజలకు  సేవ చేసే నాయకులను , పార్టీని కాపాడుకోవాలని ఆయన  కోరారు. 
 

tags
click me!