ఎన్టీఆర్‌‌కు భారతరత్న ఇచ్చి తీరాలి.. టీడీపీ మినీ మహానాడులో బాలకృష్ణ..

Published : May 08, 2023, 03:14 PM IST
ఎన్టీఆర్‌‌కు భారతరత్న ఇచ్చి తీరాలి.. టీడీపీ మినీ మహానాడులో బాలకృష్ణ..

సారాంశం

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ డిమాండ్ చేశారు.

హైదరాబాద్‌: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ డిమాండ్ చేశారు. ఈరోజు హైదరాబాద్‌లోని మాసబ్‌ ట్యాంక్‌లో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు, టీడీపీ మినీ మహానాడు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నందమూరి బాలకృష్ణ హాజరయ్యారు. ఈ సందర్బంగా టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్, ఇతర నాయకులతో కలిసి నందమూరిబాలకృష్ణ కేక్ కట్ చేశారు. ఇక, ఈ సందర్భంగా ఎన్టీఆర్‍ కు భారతరత్న ఇవ్వాలని పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు అరవింద్ కుమార్ గౌడ్ తీర్మానం ప్రవేశపెట్టారు. 

ఈ వేదికపై నుంచి బాలకృష్ణ మాట్లాడుతూ.. స్వరీయ ఎన్టీఆర్ ఎంతో మంది నాయకులకు ఎన్టీఆర్ తయారు  చేశారని చెప్పారు. దేశంలో కూడా ఆయన పేరు చెప్పుకునే రాజకీయ పార్టీలు పబ్బం గడుపుకునే పరిస్థితి ఉందని అన్నారు. ఆనాడూ తెలుగుదేశం పార్టీ శిక్షణ శిబిరం ఏర్పాటు చేసి ఎంతో మంది నాయకులను తయారు చేసిందని చెప్పారు. ఈరోజు కొందరు వేరే వేరే పార్టీల్లో, వేరే పదవుల్లో ఉన్నారని.. వాళ్లందరికీ ఎన్టీఆర్ పెట్టిన భిక్షేనని అన్నారు.  

ఎన్టీఆర్‌కు భారత రత్న ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాని బాలకృష్ణ కోరారు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా, రెండు రాష్ట్రాల ప్రజల తరఫున, అలాగే తన కుటుంబ సభ్యుల తరఫున.. ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నట్టుగా చెప్పారు. ఎన్టీఆర్‌కు భారతరత్న ఇచ్చి తీరాలని  అన్నారు. తెలంగాణ కూడా టీడీపీ ప్రజల గుండెల్లో ఉందని చెప్పారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Pensions: తెలంగాణ‌లో రూ. 4 వేలకి పెర‌గ‌నున్న‌ పెన్ష‌న్‌.. ఎప్ప‌టి నుంచి అమ‌లు కానుంది? ప్ర‌భుత్వం ప్లాన్ ఏంటి.?
School Holidays : తెలుగు స్టూడెంట్స్ ఎగిరిగంతేసే వార్త... డిసెంబర్ 16,17 రెండ్రోజులు సెలవే