కేటీఆర్ ఒక్క ట్వీట్ తో.. అతని సమస్య తీరింది..!

Published : Jul 03, 2021, 09:06 AM IST
కేటీఆర్ ఒక్క ట్వీట్ తో.. అతని సమస్య తీరింది..!

సారాంశం

దరఖాస్తు చేసుకొని 45 రోజులు గడిచినా అధికారులు స్పందించలేదు. దీంతో ఆయన తన గోడును మునిసిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌కు ట్విటర్‌లో ఫిర్యాదు చేశాడు. 

ఓ వ్యక్తి తన ఇంటి నిర్మాణ అనుమతుల కోసం కాళ్లు అరిగేలా తిరిగాడు. ఎంత ప్రయత్నించినా.. అధికారులు మాత్రం కనికరించలేదు. దీంతో.. చేసేది లేక.. తన బాధంతా ట్విట్టర్ లో కేటీఆర్ ముందు వెల్లబోసుకున్నాడు. ఆ ట్వీట్ కి కేటీఆర్ స్పందించడంతో..  అతని సమస్య తీరింది. ఈ సంఘటన షాద నగర్ లో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

షాద్‌నగర్‌ పట్టణానికి చెందిన శంకర్‌గౌడ్‌ తన ఇంటి నిర్మాణానికి అనుమతుల కోసం మునిసిపల్‌ అధికారులకు దరఖాస్తు పెట్టుకున్నాడు. దరఖాస్తు చేసుకొని 45 రోజులు గడిచినా అధికారులు స్పందించలేదు. దీంతో ఆయన తన గోడును మునిసిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌కు ట్విటర్‌లో ఫిర్యాదు చేశాడు. 

ఈ విషయం తెలిసిన అధికారులు.. ఆగమేఘాల మీద శుక్రవారం శంకర్‌గౌడ్‌కు ఇంటి నిర్మాణ అనుమతులు మంజూరు చేశారు. అయితే, ఇంటి నిర్మాణానికి అనుమతులు ఇవ్వడంలో ఆలస్యానికి కారణాలు తెలపాలని మునిసిపల్‌ కమిషనర్‌ లావణ్య.. టౌన్‌ ప్లానింగ్‌ సూపర్‌వైజర్‌ సురే్‌షకు నోటీసులిచ్చినట్లు సమాచారం.

PREV
click me!

Recommended Stories

Telangana : మూడో విడత పంచాయతీ పోలింగ్ ప్రారంభం
IMD Rain Alert : బంగాళాఖాతం మారిన వాతావరణం... ఈ ప్రాంతంలో ఇక చలివాన బీభత్సమే..!