తెలంగాణలో అదుపులోనే కరోనా: కొత్తగా 858 కేసులు.. పెరుగుతున్న రికవరీ రేటు

Siva Kodati |  
Published : Jul 02, 2021, 09:25 PM IST
తెలంగాణలో అదుపులోనే కరోనా: కొత్తగా 858 కేసులు.. పెరుగుతున్న రికవరీ రేటు

సారాంశం

తెలంగాణలో కరోనా రోజువారీ కేసుల సంఖ్య గత కొన్నిరోజులుగా 1000కి లోపే నమోదవుతోంది. తాజాగా మరోసారి వెయ్యి లోపే కేసులే నిర్థారణ అయ్యాయి. గడచిన 24 గంటల్లో 1,08,617 కరోనా పరీక్షలు నిర్వహించగా కొత్తగా 858 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

తెలంగాణలో కరోనా రోజువారీ కేసుల సంఖ్య గత కొన్నిరోజులుగా 1000కి లోపే నమోదవుతోంది. తాజాగా మరోసారి వెయ్యి లోపే కేసులే నిర్థారణ అయ్యాయి. గడచిన 24 గంటల్లో 1,08,617 కరోనా పరీక్షలు నిర్వహించగా కొత్తగా 858 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 107 కొత్త కేసులు నమోదు కాగా, అత్యల్పంగా ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో రెండేసి చొప్పున పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి.

అదే సమయంలో కోవిడ్ నుంచి 1,175 మంది కోలుకోగా, 9 మంది వైరస్‌తో మరణించారు. తాజా మరణాలతో కలిపి రాష్ట్రంలో 3,678 మంది కోవిడ్‌తో ప్రాణాలు కోల్పోయారు. తెలంగాణలో ఇప్పటివరకు 6,25,237 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,08,833 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం తెలంగాణలో 12,726 యాక్టివ్ కేసులు వున్నాయి. రాష్ట్రంలో కరోనా కేసుల రికవరీ రేటు 97.37 శాతంగా ఉంది.

ఇక జిల్లాల వారీగా కేసుల విషయానికి వస్తే.. ఆదిలాబాద్ 2, భద్రాద్రి కొత్తగూడెం 30, జీహెచ్ఎంసీ 107, జగిత్యాల 18, జనగామ 9, జయశంకర్ భూపాలపల్లి 16, గద్వాల 5, కామారెడ్డి 3, కరీంనగర్ 51, ఖమ్మం 81, ఆసిఫాబాద్ 4, మహబూబ్‌నగర్ 18, మహబూబాబాద్ 40, మంచిర్యాల 41, మెదక్ 7, మేడ్చల్ మల్కాజిగిరి 39, ములుగు 18, నాగర్ కర్నూల్ 12, నల్గగొండ 64, నారాయణపేట 4, నిర్మల్ 2, నిజామాబాద్ 6, పెద్దపల్లి 36, సిరిసిల్ల 22, రంగారెడ్డి 51, సిద్దిపేట 23, సంగారెడ్డి 12, సూర్యాపేట 52, వికారాబాద్ 10, వనపర్తి 7, వరంగల్ రూరల్ 14, వరంగల్ అర్బన్ 39, యాదాద్రి భువనగిరిలో 15 చొప్పున కేసులు నమోదయ్యాయి. 

 

PREV
click me!

Recommended Stories

Telangana : మూడో విడత పంచాయతీ పోలింగ్ ప్రారంభం
IMD Rain Alert : బంగాళాఖాతం మారిన వాతావరణం... ఈ ప్రాంతంలో ఇక చలివాన బీభత్సమే..!