నడి రోడ్డుపై హత్య.. కేటీఆర్ ఏమన్నారంటే..

Published : Sep 27, 2018, 10:21 AM IST
నడి రోడ్డుపై హత్య.. కేటీఆర్ ఏమన్నారంటే..

సారాంశం

ఈ రెండు సంఘటనలతో నగర ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. 

అత్తాపూర్ లో బుధవారం ఓ వ్యక్తిని అతి కిరాతకంగా హత్య చేసిన సంగతి తెలిసే ఉంటుంది. మొన్నటికి మొన్న మధుసూదనాచారి అనే వ్యక్తి కూతురు, అల్లుడుపై కత్తితో దాడి చేశాడు. ఈ రెండు సంఘటనలతో నగర ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. నడి రోడ్డుపై ఇలా కత్తులు పట్టుకొని అందరూ  చూస్తుండగా నరకడం నగరవాసులకు వణుకుపుట్టించింది.

కాగా.. ఈ రెండు ఘటనలపై మంత్రి కేటీఆర్ స్పందించారు. ‘నగరంలో జరిగిన ఈ రెండు హింసాత్మక ఘటనలపై నెటిజన్ల నుంచి కామెంట్లు, సలహాలు వస్తున్నాయి. ఈ ఘటనలతో నగర ప్రజలు షాకయ్యారు. తెలంగాణ డీజీపీ, హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్, సైబరాబాద్ సీపీ, రాచకొండ పోలీసులు పరిస్థితిని సమీక్షించాలి. క్షేత్రస్థాయిలో విధులు నిర్వర్తించే పోలీసులకు ఆయుధాలు అందించాలి. వెంటనే అప్రమత్తమై, స్పందించేలా వారికి తగిన శిక్షణ అందించాల’ని మంత్రి ట్వీట్ చేశారు. 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్