థ్యాంక్స్: ఉపాసన ట్విట్ కు కేటీఆర్ రిప్లై

Published : Jan 25, 2019, 06:43 AM IST
థ్యాంక్స్: ఉపాసన ట్విట్ కు కేటీఆర్ రిప్లై

సారాంశం

తెలుగు సినీ హీరో రామ్ చరణ్ సతీమణి కొణిదెల ఉపాసన చేసిన ట్వీట్‌పై తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు స్పందించారు.

హైదరాబాద్: తెలుగు సినీ హీరో రామ్ చరణ్ సతీమణి కొణిదెల ఉపాసన చేసిన ట్వీట్‌పై తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు స్పందించారు. "మా బృందం స్థ్యైర్యాన్ని పెంచినందుకు కృతజ్ఞతలు" అంటూ కేటీఆర్ ఉపాసన ట్వీట్‌కు రిప్లై ఇచ్చారు.
 
దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎనకమిక్ ఫోరం సదస్సులో పాల్గొనేందుకు వెళ్లిన ఉపాసన.. ఇన్వెస్ట్ తెలంగాణ డెస్క్‌కు కోఆర్టినేటర్‌గా పని చేశారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టే కంపెనీలకు ఆమె సమాచారం అందించారు. తెలంగాణలో పెట్టుబడులకు అనుకూల పరిస్థితులను ఈ సందర్భంగా ఇన్వెస్టర్లకు తెలిపారు. 

ఆ విషయాన్ని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ట్విట్టర్ ద్వారా ఉపాసన వెల్లడించారు. కేటీఆర్ సర్ "నేను కొత్త ఉద్యోగంలో చేరారు. నా జాబ్ ఎలా ఉంది" అని ట్వీట్‌లో అడిగారు. తెలంగాణ డెస్క్‌లో పని చేసిన ఫొటోలను కూడా ఆమె షేర్ చేశారు.

 

సంబంధిత వార్త

కేటీఆర్ సర్.. నా జాబ్ ఎలా ఉంది?: ఉపాసన

PREV
click me!

Recommended Stories

School Holidays : నెక్ట్స్ వీక్ లో వరుసగా రెండ్రోజులు సెలవులు ఖాయం.. మరో రెండ్రోజులు కూడానా?
IMD Rain Alert : అక్కడ వర్షాలు, ఇక్కడ చలి .. ఇక తెలుగు రాష్ట్రాల్లో అల్లకల్లోలమే..!