
హైదరాబాద్: Rajya Sabha లో ప్రధాన మంత్రి Narendra Modi అసహ్యంగా మాట్లాడారని తెలంగాణ మంత్రి, TRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR బుధవారం నాడు చెప్పారు.Telangana రాష్ట్ర ఏర్పాటు అంశంపై రాజ్యసభలో ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం నాడు చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ స్పందించారు.
మోడీవి పనికిమాలిన మాటలంటూ కేటీఆర్ మండిపడ్డారు. ఇలా మాట్లాడిన ప్రధాని మరొకరు ఉండరన్నారు. ప్రజల్లో విశ్వాసం కల్పించాల్సిన ప్రధాని విద్వేషం రెచ్చగొడుతున్నారని చెప్పారు.రైతుల పోరాటాలతో రైతు చట్టాలను వెనక్కి తీసుకొన్నారని కేటీఆర్ గుర్తు చేశారు. తెలంగాణ ప్రజలను కించపర్చేలా మాట్లాడిన మోడీ తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.గుజరాత్ కంటే తెలంగాణ అభివృద్ది జరుగుతుందని మోడీకి కడుపు మంట అని మండిపడ్డారు.
Andhra pradesh రాష్ట్ర విభజనపై కూడా ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీ ఇలాంటి సమస్యలు వచ్చి ఉండేవి కావన్నారు. రాష్ట్ర విభజన సరిగా చేసి ఉంటే ఇలాంటి సమస్యలు వచ్చి ఉండేవి కావన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైందని ఆయన చురకలంటించారు. రాష్ట్ర విభజనకు తాము వ్యతిరేకం కాదని Prime Minister మోడీ స్పష్టం చేశారు. విభజన జరిగిన తీరును మాత్రం ఆయన తప్పుబట్టారు. ఏపీకి కాంగ్రెస్ అన్యాయం చేసిందన్నారు. కేంద్రంలో అధికారంలోకి రావడానికి అవకాశం ఇచ్చిన ఏపీకి అన్యాయం చేశారని మోడీ గుర్తు చేశారు. హడావుడిగా రాష్ట్ర విభజన చేశారని మోడీ మండిపడ్డారు.
Vajpayee ప్రధానిగా ఉన్న సమయంలో ఏర్పాటు చేసిన రాష్ట్రాల గురించి ఆయన గుర్తు చేశారు. ఆనాటి ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకొన్న కారణంగానే ఆయా రాష్ట్రాల్లో ఎలాంటి సమస్యలు రాలేదన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొన్న హడావుడి నిర్ణయాలతో ఇబ్బందులు వచ్చాయన్నారు.
ఉమ్మడి ఏపీ రాష్ట్ర విభజన సమయంలో చోటు చేసుకొన్న పరిణామాలను ఆయన గుర్తు చేశారు. విభజన వ్యవహరం ఎలా జరిగిందనేది కీలకమన్నారు. Parliament లో మైకులు కట్ చేసి తలుపులు మూసి బిల్లు పాస్ చేశారని ప్రధాని మోడీ విమర్శించారు. ప్రజాస్వామ్యంలో ఇలా చేస్తారా అని మోడీ ప్రశ్నించారు. మీ అహంకారంతో తెలుగు రాష్ట్రాలకు నష్టం జరిగిందన్నారు గతంలో తాము ఛత్తీస్‌ఘడ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు ఏర్పాటు చేసిన మమయంలో శాంతియుత వాతావరణం ఉన్న విషయాన్ని మోడీ గుర్తు చేసుకొన్నారు. కానీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమయంలో ఈ తరహ చర్యలు తీసుకోలేదన్నారు. . ఈ వ్యాఖ్యలపై టీఆర్ఎస్ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టింది. మరోవైపు మోడీ వ్యాఖ్యలను కాంగ్రెస్ నేతలు కూడా తప్పు బట్టారు.మోడీ దిష్టిబొమ్మలను తెలంగాణ కాంగ్రెస్ నేతలు దగ్దం చేశారు.
ప్రధాని వ్యాఖ్యలను బీజేపీ నేతలు సమర్ధించుకొంటున్నారు. తెలంగాణపై ప్రధాని చేసిన వ్యాఖ్యలను టీఆర్ఎస్, కాంగ్రెస్ వక్రీకరిస్తోందని కాషాయ నేతలు చెబుతున్నారు. కాంగ్రెస్ ను విమర్శిస్తే టీఆర్ఎస్ నేతలు ఎందుకు స్పందిస్తున్నారని బీజేపీ ప్రశ్నిస్తోంది. గతంలో తాము మూడు రాష్ట్రాలు ఏర్పాటు చేసిన సమయంలో ఎలాంటి అశాంతి చోటు చేసుకోలేదని బీజేపీ నేతలు గుర్తు చేస్తున్నారు.