ఈ ఫొటోలు చూసి చెప్పండి కెటిఆర్

Published : Nov 22, 2016, 12:23 PM ISTUpdated : Mar 25, 2018, 11:52 PM IST
ఈ ఫొటోలు చూసి చెప్పండి కెటిఆర్

సారాంశం

సంతోశ్ ది తమ పార్టీ కాదన్న ఐటి మంత్రి గులాబి నేతలతో నెట్ లో హల్ చల్ చేస్తున్న సంతోశ్ ఫొటోలు ?

మనుషులు అబద్ధాలు చెబతారు.. రాజకీయనాయకులు ఏదైనా చెబుతారు.. ఫొటోలు మాత్రం వాస్తవాలే చూపెడుతాయి. సూర్యపేట్ జిల్లా లో ఓ పార్టీ కి చెందిన చోటా నేత సంతోశ్ ఉద్యోగాల పేరుతో యువతను మోసం చేసి తన దగ్గరికి వచ్చిన వారిని చితక్కొట్టని వీడియో నెట్ లో  చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే.

 

సదరు నేత టిఆర్ ఎస్ పార్టీ వాడని, మంత్రి జగదీశ్ రెడ్డి కి అత్యంత సన్నిహితుడని ఆన్ లైన్ లో వార్తలు షికారు చేశాయి.

అయితే దీన్ని టిఆర్ఎస్ పార్టీ నేతలు తీవ్రంగా ఖండించారు. ఆ వ్యక్తి ఆమ్ ఆద్మీ పార్టీ నేత అని, ఆన్ లైన్ లో తప్పుడు ప్రచారం చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని ఐటి మంత్రి కెటిఆర్, ఎమ్ ఎల్ సి కర్నె ప్రభాకర్ హెచ్చరించారు కూడా.

అయితే ఇప్పుడు అదే సోషల్ మీడియాలో సంతోశ్ టిఆర్ఎస్ నేత అని చెప్పడానికి రుజువుగా అనేక ఫొటోలు దర్శనమిస్తున్నాయి.

 

ఈ ఫొటోలు చూసైనా కెటిఆర్ మరోసారి అతనిది ఏ పార్టీ నో కనుక్కోని సోషల్ మీడియా మీద కామెంట్లు చేస్తే బాగుంటుంది.

PREV
click me!

Recommended Stories

Revanth Reddy: లాగులో తొండలు విడిచి కొడతా కేటీఆర్ పై రేవంత్ రెడ్డి సెటైర్లు | Asianet News Telugu
Bank Holidays : జనవరి 2026 లో ఏకంగా 16 రోజుల బ్యాంక్ హాలిడేస్... ఏరోజు, ఎందుకు సెలవు?