ఓటుకు నోటు తీర్పు వాయిదా

Published : Nov 22, 2016, 11:30 AM ISTUpdated : Mar 25, 2018, 11:40 PM IST
ఓటుకు నోటు తీర్పు వాయిదా

సారాంశం

త్వరలో తుది తీర్పు

ఓటుకు నోటు కేసులో అడ్డంగా బుక్కైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పాత్రపై మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌పై హైకోర్టులో మంగళవారం వాదనలు ముగిశాయి. తీర్పును వాయిదా వేస్తున్నట్లు కోర్టు ప్రకటించింది. ఇప్పటికి పలు దఫాలుగా ఈ కేసులో వాదనలు జరిగాయి.

 

ఎమ్మెల్యే ఆర్కే తరఫున సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి, చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది సిద్దార్థ లూథ్రా వాదనలు వినిపించారు.

 

మధ్యలో ఈ కేసులో చంద్రబాబు పాత్రపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా తన వాదనలు వినిపించారు. మొత్తానికి ఈ కేసులో వాదనలు మంగళవారంతో ముగిసినట్లు హైకోర్టు ప్రకటించి, తీర్పును వాయిదా వేసింది. త్వరలోనే దీనిపై తుది ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. 

PREV
click me!

Recommended Stories

Revanth Reddy: లాగులో తొండలు విడిచి కొడతా కేటీఆర్ పై రేవంత్ రెడ్డి సెటైర్లు | Asianet News Telugu
Bank Holidays : జనవరి 2026 లో ఏకంగా 16 రోజుల బ్యాంక్ హాలిడేస్... ఏరోజు, ఎందుకు సెలవు?