ప్రతి యేటా కళ ఉత్సవాలు నిర్వహిస్తాం..మంత్రి కేటీఆర్ 

By Rajesh KarampooriFirst Published Oct 3, 2022, 4:09 AM IST
Highlights

కరీంనగర్ లో అంత‌ర్జాతీయ కళ ఉత్సవాల వేడుకల ముగింపు సందర్భంగా తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రత్యేక అతీదిగా హాజరయ్యారు.  

ఇకపై కరీంనగర్ లో ప్రతి యేటా కళ ఉత్సవాలు నిర్వహిస్తామని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పేర్కొన్నారు. ఆదివారం రాత్రి నగరంలోని స్టేడియంలో అంతర్జాతీయ కళ  ఉత్సవాల ముగింపు వేడుకలకు మంత్రి కేటీఆర్ ప్రత్యేక అతీదిగా హాజరయ్యారు.ప్రత్యేక హెలికాప్టర్లో ఆయన వేడుకలకు హాజరు కాగా..  అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.

అనంతరం వెంకటేశ్వర స్వామి చిత్రపటానికి పూజ చేసి వేడుకలను ప్రారంభించారు. దేశంలోని వివిధ రాష్ట్రాల సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా మూడు రోజులుగా నిర్వహించిన ఈ ఉత్సవాలకు ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ కార్య‌క్ర‌మంలోక్రాకర్ షో ప్రేక్ష‌కుల ఆకట్టుకుంది. ఈ కార్య‌క్ర‌మంలో దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ స్థాయి కళాకారుల పాల్గొని త‌మ ప్ర‌ద‌ర్శ‌న‌లిచ్చారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. కళోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించిన మంత్రి కమలాకర్ ను అభినందిస్తున్న‌ని అన్నారు. కరీంనగర్ వచ్చినందుకు సంతోషంగా ఉందనీ అన్నారు.  ఇక‌.. తెలంగాణ‌లో ఎరుపు, తెలుపు ఇప్పుడు గులాబీ రంగుగా మారింద‌ని వ్యాఖ్యానించారు. ఉద్యమం లో కేసీఆర్ మాట పవార్ ఫుల్ గా పేలిందో...కళాకారులు పాటలు అంత పెళ్లినాయని అన్నారు. కళాకారులకు ఉద్యోగలిచ్చి గౌరవించింది తెలంగాణ ప్రభుత్వమేన‌ని అన్నారు.

కరీంనగర్ కళ‌ ఉత్సవాలు స్పూర్తితో తెలంగాణ వైభవాన్ని జరుపుకునే ఏర్పాటు చేస్తామని అన్నారు. తాను కరీంనగర్ లో పుట్టినని, కరీంనగర్ తో త‌నకు ప్రత్యేకమైన ప్రేమ అభిమానం ఉందని అన్నారు. సీఎం కేసీఆర్ కు కరీంనగర్ అంటే చాలా ఇష్టమ‌నీ, కరీంనగర్ ఆశీర్వాదం వల్లనే తెలంగాణ కళ సాకారం అయ్యింద‌ని అన్నారు. అదే తెలంగాణ యాస సినిమాల్లోనూ స‌క్సెస్ సాధిస్తోంద‌న్నారు  అయితే.. దేశ‌మంతా తెలుగు సినిమాలు ఎట్లా హిట్ కొడుతున్నాయో.. ప్ర‌జ‌ల ఆశీర్వాదం ఉంటే తెలుగు నేల‌పై పుట్టిన పార్టీ దేశ‌మంతా దుమ్ము రేపుతుంద‌ని ఆశాభావం వ్య‌క్తం చేశారు.  అనంతరం ఉత్తమ అధికారులను ఘనంగా సత్కరించారు. కరీంనగర్ అదనపు కలెక్టర్ శ్యాం ప్రసాద్ లాల్ ను ప్రత్యేకంగా అభినందించారు.

మూడు రోజుల పాటు దేశవ్యాప్తంగా ఉన్న జానపద కళాకారులు ఇజ్రాయెల్, అండమాన్ నికోబార్ దీవుల వంటి ఇతర దేశాల నుండి వ‌చ్చిన క‌ళాకారులు ప్రేక్షకులను అలరించారు.ఈ కార్య‌క్ర‌మంలో బీసీ సంక్షేమం, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ కనుమళ్ల విజయ, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి, కరీంనగర్ మేయర్ వై సునీల్ రావు, ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్, కలెక్టర్ ఆర్వీ కర్ణన్, పోలీస్ కమిషనర్ వీ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

click me!