తెలంగాణా అడిగితే సిగరెట్టా, బీడీనా అన్నారు.. ఇప్పుడేమో వారి పిల్లలే : షర్మిలపై హరీశ్‌రావు వ్యాఖ్యలు

By Siva KodatiFirst Published Oct 2, 2022, 8:16 PM IST
Highlights

వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిలపై పరోక్ష వ్యాఖ్యలు చేశారు మంత్రి హరీశ్ రావు. కొంచెం నోరు అదుపులో పెట్టుకోవాలని లేదంటే ప్రజలు తిరగబడతారని ఆయన హెచ్చరించారు. 

వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిలపై మండిపడ్డారు టీఆర్ఎస్ నేత , మంత్రి హరీశ్ రావు. ఆనాడు తెలంగాణ ఇవ్వడానికి సిగరెట్టు, బీడీనా అన్నారని ఆయన గుర్తుచేశారు. ఇవాళ వారి పిల్లలు వచ్చి తెలంగాణలో తిరుగుతున్నారంటూ హరీశ్ రావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. కొంచెం నోరు అదుపులో పెట్టుకుంటే మంచిదని ఆయన షర్మిలకు హితవు పలికారు. మీరు ఇక్కడికి వచ్చి తిరుగుతున్నారంటే అంతకంటే దరిద్రం వుండదంటూ హరీశ్ రావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రజలు తిరగబడతారు జాగ్రత్త అని ఆయన హెచ్చరించారు. 

అంతకుముందు మంత్రి హరీశ్ రావు మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ ప్రభుత్వం టీచర్లపై కేసులు పెట్టి లోపల వేస్తుందన్నారు. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం గడిచిన ఐదేళ్లలో టీచర్లకు 73 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చిందని మంత్రి అన్నారు. అయితే రాష్ట్రంలో వేతనాలు కాస్త ఆలస్యం అవుతున్న మాట వాస్తవమేనని హరీశ్ రావు అంగీకరించారు. అంతేకాకుండా ఏపీ సీఎం వైఎస్ జగన్‌లా కేంద్రం పెట్టిన షరతులకు అంగీకరించి వుంటే ఏటా రూ.6 వేల కోట్ల అప్పులు తీసుకుని రాష్ట్రంలో మరిన్ని సంక్షేమ పథకాలను అమలు చేసేవారమని హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. 

ALso Read:వైఎస్ కుటుంబం విచ్ఛిన్నం.. ఇప్పుడు కేసీఆర్‌పై కన్ను, సజ్జల బుద్ధే అంత : గంగుల కమలాకర్ వ్యాఖ్యలు

ఇకపోతే... ఏపీలో కరెంట్ కోతలపైనా హరీశ్ రావు మొన్నామధ్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను తిరుపతి వెళ్లినప్పుడు కొందరినీ కలిశానని చెప్పారు. వాళ్లది గుత్తి, అనంతపురం అని చెప్పారని... మీ దగ్గర కరెంట్ ఎంత సేపు వుంటుందని అడిగానని హరీశ్ రావు తెలిపారు. ఉదయం 3 గంటలు, రాత్రి 4 గంటలు కరెంట్ వుంటుందని తనకు చెప్పారని మంత్రి చెప్పారు. మళ్లీ గంట గంటకి కరెంట్ పోతుందని తెలిపారని హరీశ్ రావు వెల్లడించారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యల నేపథ్యంలో వైసీపీ, టీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. 

click me!