భారత్ బంద్: షాద్‌నగర్ లో రాస్తారోకోలో పాల్గొన్న కేటీఆర్

By narsimha lodeFirst Published Dec 8, 2020, 12:17 PM IST
Highlights

నూతన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ షాద్‌నగర్ లో హైద్రాబాద్-బెంగుళూరు జాతీయ రహదారిపై టీఆర్ఎస్ రాస్తారోకోకు దిగింది. తెలంగాణ మంత్రి కేటీఆర్  ఈ రాస్తారోకోలు పాల్గొన్నారు.

హైదరాబాద్: నూతన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ షాద్‌నగర్ లో హైద్రాబాద్-బెంగుళూరు జాతీయ రహదారిపై టీఆర్ఎస్ రాస్తారోకోకు దిగింది. తెలంగాణ మంత్రి కేటీఆర్  ఈ రాస్తారోకోలు పాల్గొన్నారు.

మంత్రి కేటీఆర్ తో పాటు మరో మంత్రి శ్రీనివాస్ గౌడ్, టీఆర్ఎస్ సెక్రటరీ జనరల్  కె. కేశవరావు కూడ ఈ రాస్తారోకోలో పాల్గొన్నారు.  రైతుల ఆ:దోళనకు టీఆర్ఎస్ సంపూర్ణ మద్దతును ప్రకటించింది.

 

కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలు రైతు వ్యతిరేకమైనవి. వీటి ద్వారా రైతన్నలకు లాభం జరగకపోగా భారీ నష్టం వాటిల్లుతుంది. అందుకే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారి పిలుపు మేరకు టీఆర్ఎస్ పార్టీ ఈ చట్టాలను వ్యతిరేకిస్తోంది

— KTR (@KTRTRS)

 

దేశానికి అన్నం పెట్టే రైతన్న కోసం నేడు అన్ని రాష్ట్రాల రైతులు కదులుతున్నారు. గత ఆరేళ్లుగా రైతు బంధుగా ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ రైతన్నల దేశవ్యాప్త ఆందోళనకు పూర్తి మద్ధతు పలుకుతోంది.

— KTR (@KTRTRS)

 

నూతన వ్యవసాయ చట్టం ద్వారా బ్లాక్‌ మార్కెట్‌ను నిరోధించడానికి ఏర్పాటు చేసిన నిత్యావసరాల నిల్వల చట్టాన్ని సవరించారు. వ్యాపారులు కావాలనే కృత్రిమ కొరత సృష్టించి ధరలు పెంచి అమ్ముకునే ప్రమాదం ఉంది. ఇది రైతులకు, వినియోగదారుడికి ఇద్దరికీ నష్టమే

— KTR (@KTRTRS)

 

నూతన వ్యవసాయ చట్టాలను తమ పార్టీ ఎందుకు వ్యతిరేకిస్తోందో మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. ఈ కొత్త చట్టాలను అమలు చేయడం ద్వారా రైతులకు లాభం కంటే  నష్టమే ఎక్కువగా కలుగుతోందనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు.

తెలంగాణలో వ్యాపారులు కూడ ఈ బంద్ కు మద్దతు తెలపాలని టీఆర్ఎస్ కోరింది. కనీసం రెండు గంటలపాటు  దుకాణాలను మూసివేయాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్  కోరిన విషయం తెలిసిందే.

షాద్‌నగర్ లో రోడ్డుపై  బైఠాయించిన కేటీఆర్, కేకే, మంత్రి శ్రీనివాస్ గౌడ్ లు ప్ల కార్డులు ప్రదర్శించారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలని టీఆర్ఎస్ డిమాండ్ చేసింది.

also read:భారత్ బంద్: తెలంగాణలో డిపోలకే పరిమితమైన బస్సులు, నిరసన ప్రదర్శనలు

టీఆర్ఎస్ కు చెందిన ప్రజా ప్రతినిధులంతా ఈ రాస్తారోకో కార్యక్రమంలో పాల్గొన్నారు.రాష్ట్రంలో బీజేపీ మినహా అన్ని పార్టీలు ఈ బంద్ కు సంపూర్ణ మద్దతును ప్రకటించిన విషయం తెలిసిందే. 


 

click me!