హిమాచల్‌లో చిక్కుకున్న తెలుగు విద్యార్థులు: ఢిల్లీ రెసిడెంట్ కమిషనర్ ను అప్రమత్తం చేసిన కేటీఆర్

By narsimha lode  |  First Published Jul 11, 2023, 11:23 AM IST

హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో చిక్కుకున్న  తెలుగు విద్యార్థులను రక్షించేందుకు  అవసరమైన చర్యలు తీసుకోవాలని  మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు. 


హైదరాబాద్: హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో  కొందరు తెలుగు విద్యార్ధులు చిక్కుకున్నారనే విషయమై అందిన సమాచారం మేరకు ఢిల్లీలోని  రెసిడెంట్  కమిషనర్ ను అప్రమత్తం చేసినట్టుగా  తెలంగాణ మంత్రి కేటీఆర్  పేర్కొన్నారు.

హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని కులు, మనాలిలో  కొందరు విద్యార్ధులు  చిక్కుకుపోవడంపై పేరేంట్స్ ఆందోళన చెందుతున్నారు.  ఈ విషయమై  కేటీఆర్ కు  కొందరు విద్యార్థుల పేరేంట్స్  సమాచారం ఇచ్చారు. తమ పిల్లలను  సురక్షితంగా తెలంగాణకు  రప్పించేందుకు  చర్యలు తీసుకోవాలని వారు  కోరారు.  ఈ విషయమై  తెలంగాణ మంత్రి కేటీఆర్ న్యూఢిల్లీలోని రెసిడెంట్  కమిషనర్ ను అప్రమత్తం  చేశారు.  హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో చిక్కుకున్న  తెలుగు విద్యార్థులను స్వరాష్ట్రానికి రప్పించేందుకు  చర్యలు తీసుకోవాలని  ఆదేశించారు.ఈ విషయంలో ఏమైనా సహాయం అవసరమైతే  తమను సంప్రదించాలని  మంత్రి కోరారు.

Latest Videos

undefined

హిమాచల్ ప్రదేశ్ లో వరదల్లో చిక్కుకున్న  వారి కోసం  న్యూడిల్లీ తెలంగాణ భవన్ లో  హెల్ప్ లైన్ ను ఏర్పాటు చేసింది  తెలంగాణ ప్రభుత్వం. సహాయం కోసం  9643723157, 9871999044 ఫోన్ చేయవచ్చని  ప్రభుత్వం తెలిపింది.  మరో వైపు  rctelangana@gmail.com లో ఫిర్యాదు చేయవచ్చని  తెలంగాణ ప్రభుత్వం తెలిపింది.
 

 

 

Have received information from some distressed parents that a few Telugu students are stuck in
Kullu and Manali of Himachal Pradesh

Have alerted our Resident Commissioner in New Delhi to assist the students

If anyone needs assistance they can reach out to or…

— KTR (@KTRBRS)

హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో రికార్డు స్థాయి వర్షపాతం నమోదైన విషయం తెలిసిందే. ఇప్పటివరకు  నమోదు కాని భారీ వర్షపాతం హిమాచల్ రాష్ట్రంలో నమోదైంది. దీంతో  పెద్ద పెద్ద భవనాలు కూడ  పేకమేడలా కుప్పకూలిపోతున్నాయి.  బ్రిడ్జిలు  వరద నీటిలో కొట్టుకుపోతున్నాయి. భారీ వర్షాల కారణంగా  కొండ చరియలు విరిగిపడి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. హిమాచల్ ప్రదేశ్ సీఎంతో  ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నిన్న  ఫోన్ లో మాట్లాడారు. భారీ వర్షాల కారణంగా  నెలకొన్న పరిస్థితులపై  మోడీ ఆరా తీశారు.  కేంద్రం నుండి అవసరమైన సహాయాన్ని అందిస్తామని  కూడ మోడీ హామీ ఇచ్చారు.  భారీ వర్షాల కారణంగా హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఢిల్లీలలో  పెద్ద ఎత్తున ఆస్తి,  ప్రాణ నష్టం సంభవించింది.

click me!