ఉచిత విద్యుత్ పై కాంగ్రెస్ ప్రకటనపై రెండు రోజుల పాటు నిరసనలకు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ దిష్టిబొమ్మలను దగ్ధం చేయాలని కేటీఆర్ కోరారు.
హైదరాబాద్: ఉచిత విద్యుత్ పై కాంగ్రెస్ ప్రకటనపై ఇవాళ, రేపు నిరసన కార్యక్రమాలను నిర్వహించాలని బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ మేరకు మంగళవారంనాడు ఓ ప్రకటనను విడుదల చేశారు.వ్యవసాయ, రైతు వ్యతిరేక ఆలోచన విధానాలపై నిరసనలు చేయాలని బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ దిష్టిబొమ్మలను దహనం చేయాలని ఆ పార్టీ పిలుపునిచ్చింది.
ఉచిత విద్యుత్ రద్దు చేయాలని కాంగ్రెస్ దుర్మార్గపు ఆలోచనగా కన్పిస్తుందని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. గతంలోనూ విద్యుత్ ఇవ్వకుండా రైతులను గోసపెట్టారని ఆయన కాంగ్రెస్ పై మండిపడ్డారు. రైతు వ్యతిరేక విధానాలను కాంగ్రెస్ మరోసారి బయటపెట్టిందన్నారు. తెలంగాణ రైతులు, ప్రజలు కాంగ్రెస్ పార్టీ ప్రకటనను తీవ్రంగా వ్యతిరేకించాలని ఆయన కోరారు. రైతులకు ఉచిత విద్యుత్ మూడు గంటలు చాలునని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేసినట్టుగా ప్రచారం సాగుతుంది.
undefined
also read:ఉచిత విద్యుత్ రద్దు చేస్తామని మేనిఫెస్టోలో పెడతారా: రేవంత్ రెడ్డిపై జగదీష్ రెడ్డి ఫైర్
తానా సభల్లో పాల్గొన్న రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేసినట్టుగా సోషల్ మీడియా వేదికగా ప్రచారం సాగుతుంది.ఈ ప్రచారంపై బీఆర్ఎస్ మండిపడింది. ఉచిత విద్యుత్ ను రైతులకు ఇవ్వవద్దని కాంగ్రెస్ వైఖరిగా కన్పిస్తుందని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతులకు ఉచిత విద్యుత్ ను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో ఉచిత విద్యుత్ ను పథకాన్ని అమలు చేశారు.