
కొంపెల్లిలో నిర్వహించిన టీఆర్ఎస్ ప్లీనరీ సభ ఐటీ మంత్రి కేటీఆర్ కు నిరాశనే మిగిల్చినట్లుంది.
పార్టీ భవిష్యత్తు అధినేతగా, ప్రభుత్వంలో నెంబర్ 2 గా వ్యవహరిస్తున్న సీఎం కేసీఆర్ కుమారుడు కేటీఆర్ కు ఈ సారి వర్కింగ్ ప్రసిడెంట్ హోదాను కట్టబెడుతారని అందరూ భావించారు.
అయితే ఇప్పటి వరకు అలాంటి ప్రకటనే రాకపోవడం కేటీఆర్ అభిమానులను నిరాశపరిచింది.సీఎం కేసీఆర్ ఎప్పటిలాగే ఏకగ్రీవంగా మరోసారి పార్ట అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అదే సమయంలో కేటీఆర్ ను కూడా వర్కింగ్ ప్రసిడెంట్ గా ప్రకటిస్తారని జోరుగా ప్రచారం జరిగింది. కానీ, ఆ ప్రస్తావనే ప్లీనరీలో కనిపించకుండా పోయింది.
పార్టీ లో ఏలాంటి విభేదాలు లేని ప్రస్తుత సమయంలో ఇప్పుడు కొత్తగా కొందరి పదవులపై వేటు వేసి అనవసర రాద్దాంతం చేయడం సరికాదని కేసీఆర్ భావించి ఉండొచ్చని, అందుకే కొత్తగా పదవులు ప్రస్తావని తీసుకరాలేదని పార్టీ సన్నిహత వర్గాలు చెబుతున్నాయి.