రిమాండ్ మహిళా ఖైదీలకు కేటిఆర్ కొత్త కానుక

First Published Sep 21, 2017, 6:56 PM IST
Highlights
  • బతుకమ్మ చీరల పథకం విస్తరిస్తున్న సర్కార్
  • అనాథ ఆశ్రమాల్లోని వృద్ధులకు బతుకమ్మ చీరలు
  • రిమాండ్ మహిళా ఖైదీలకు కూడా పంపిణీ

తెలంగాణ ఐటి, టెక్స్ టైల్ శాఖ మంత్రి కేటిఆర్ ఒక కొత్త నిర్ణయం తీసుకున్నారు. బతుకమ్మ చీరలు రాష్ట్రవ్యాప్తంగా ఆధార్ కార్డు ఉన్నవారందరికీ అందజేస్తున్నారు. అయితే వివిద రకాల నేరాలు చేసి జైళ్లలో ఉన్న రిమాండ్ ఖైదీలకు కూడా బతుకమ్మ చీరలు పంపిణీ చేయాలని కేటిఆర్ నిర్ణయించారు. దీనిపై సంబంధిత శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.  

తెలంగాణ ప్రభుత్వం పంపిణీ చేస్తున్న చీరల పథకాన్ని విస్తరించనున్నారు. చీరల పథకంపై ప్రభుత్వానికి  మరిన్ని వర్గాల నుంచి వచ్చిన వినతుల మేరకు మరో నిర్ణయం తీసుకున్నది ప్రభుత్వం. ముఖ్యంగా అనాధ ఆశ్రామాలు, వృద్ధాశ్రామాల్లో ఉంటున్న మహిళలకు, సమాజంలోని డెస్టిట్యూట్స్ కోసం పనిచేస్తున్న సేవా సంస్థలో పని చేస్తున్న మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

రిమాండ్ లో ఉన్న మహిళా ఖైదీలకు సైతం బతకమ్మ చీరలు పంపిణీ చేయాలని మంత్రి కెటి రామారావు టెక్స్ టైల్స్ శాఖ డైరెక్టర్ శైలజా రామయ్యర్ కు అదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా హైదరాబాదు నగరంలోని అనేక సేవా సంస్థలు, అనాధాశ్రామాలు, వృద్దాశ్రామాల నుంచి మంత్రికి ప్రత్యేకంగా బతకమ్మ చీరల కోసం విజ్ఞప్తులు వచ్చాయి. ఈ నేపథ్యంలో textile శాఖ అధికారులతో మాట్లాడి వారందరికీ బతుకమ్మ చీరల పంపిణీ చేయాలన్న నిర్ణయం తీసుకోవడం జరిగింది.

ప్రభుత్వం ఇప్పటికే అవసరమైన కోట 4లక్షల చీరలకి అదనంగా సేకరించి పెట్టుకున్న చీరల నుంచి వీరికి బతుకమ్మ చీరలు పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు హైదరాబాద్ నగరంలో జియచ్ యంసి కమీషనర్, జిల్లాల్లో కలెక్టర్లు వివిధ సేవా సంస్థలకు బతుకమ్మ చీరలను అందిస్తారు.

 

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

click me!