
మంత్రిని కలుసుకోవడం చాలా కష్టం. మంత్రి ఎంతమంచోడయినా,ప్రభుత్వం లాంఛనాలు ఆయన చుట్టు అడ్డుగోడలు లేపుతాయి. మంత్రి ని కలుసుకోవాలంటే, ఆయన కార్యాలయానికి పోన్ చేయాలి, అప్పాయంట్ తీసుకోవాలి. ఆయన కార్యాలయం సిబ్బింది ఫోన్ ఎత్త వచ్చు, ఎత్తకపోవచ్చు. ఎత్తినా ప్రతి పెన్షన్ రాలేదని చెప్పడానికో, మా వీధిలో కరెంటుపోతావుందనో ఫిర్యాదు చేయడానికో మంత్రి దర్శనం దొరక్క పోవచ్చు. ఒక వుత్తరం పిటిషన్ పంపిస్తే అది మంత్రి చేతికి అందవచ్చు, అందుకపోవచ్చు.
మునిసిపల్ మంత్రి కెటిఆర్ దీనికొక పరిష్కారంకనుకున్నారు. తాను ఎన్ని కార్యక్రమాల్లో ఉన్నా చివరకు ముఖ్యమయిన మీటింగ్ లలో ఉన్నాప్రజలకు మాత్రం ఒక చిన్న ట్వీట్ దూరంలో నే ఉండేలా ఏర్పాట్లు చేసుకున్నారు. సమస్యలున్న వారెవరైనాసరే @KTRTRS అని పిలిస్తే పలికేస్తున్నారు.నాలుగు ముక్కల పిటిషన్ ఇపుడు ట్విట్టర్ ద్వారా ఇపుడు నేరుగా ఆయన చేతికే అందుతున్నది. ఆయన స్పందిస్తున్నారు.సమస్య గురించి సంబంధిత అధికారులకు వెంటనే ట్విట్టర్ ఉత్తర్వలిస్తున్నారు. అధికారులు శెలవనుకోకుండా మంత్రి ట్వీట్ ను స్వీకరిస్తున్నారు. పనులు చేస్తున్నారు. తాను ప్రపంచంలో ఏ మూల వున్నా, తెలంగాణాలో బాధితుతు ఎంతమారు మూల గ్రామంలో ఉన్నా ట్విట్టర్ ద్వారా కెటిఆర్ ను సంప్రందించవచ్చు.
అదివారం నాడు కీసర మండలం నాగారం గ్రామానికి చెందిన బెనోని శ్రీకాంత్ (@Srikanthbenoni) వాళ్ల పొరుగున ఉన్న వితంతువొకరికి పెన్షన్ రాని విషయన్ కెటిఆర్ దృష్టికి తీసుకువచ్చారు. గత పదినెలలుగా దీనికోసం వాళ్ల ఎందరో ఆఫీసర్లను కలుసుకున్నా ప్రయోజనం లేని విషయాన్ని కెటిఆర్ కు నాలుగు ముక్కల్లో చెప్పారు.కెటిఆర్ వెంటనే స్పందిస్తూ ఈ ఫిర్యాదు మీద చర్య తీసుకోవాలని కలెక్టర్ ట్విట్ లో కోరారు. వెంటనే మెడ్చల్ కలెక్టర్ ఎం. వి రెడ్డి వితంతువుకు చెందిన వివాలన్నీ ఇవ్వాలని , తప్ప క సహాయం చేస్తామని శ్రీకాంత్ కు హామీ ఇచ్చారు. ఇదంతా గంటల్లో జరిగిపోయింది. ఎం వి రెడ్డికి తొలినుంచి మంచి ఆఫీపర్ గా పేరున్నా, ఇలాంటి చిన్న విషయాన్ని ఆయన దృష్టికి తీసుకువెళ్లడం ఆ వితంతువుకు సాధ్యమేనా. అయితే, శ్రీకాంత్ చొరవతో ఈ సమస్య మంత్రి దృష్టికి, అక్కడి నుంచి కలెక్టర్ దృష్టికి వెళ్లింది.
ఈ మధ్య కాలంలో కెటిఆర్ ట్విట్టర్ అడ్రస్ @KTRTRS బాగా పాపులర్ అయింది. ఆయన ఎక్కడ దొరక్కపోయినా ఇక్కడ దొరికేస్తున్నారు. దానితో అనేక మంది అనేక సమస్యలను ఆయన దృష్టికి తీసుకువస్తున్నారు. తాజాగా హైదరాబాద్ లో కరెంటు కోత వుందన్న విషయం ఆయన దృష్టి కి వెళ్లింది. కొన్ని ప్రాంతాలలో కరెంటు కోత లేక పోయినా కొన్ని చోట్ల, కారణమేదయినా కావచ్చు. గంటల తరబడి కరెంటు పోవడం జరుగుతూ వుంది. హిమయత్ నగర్ స్ట్రీట్ నెంబర్ 19 తో కరెంటు పోవడం సర్వసాధారణం. పోతే, గంటకు తగ్గదు. ఇదికరెంటు కోత కావచ్చనే ఇక్కడి అనుమానాలు.
ఇలాంటి సమస్యను విక్రమ్ సింగ్ (@vikram193) మంత్రి దష్టికి తీసుకువస్తూ, హైదరాబాద్ లో కరెంటు కోత మళ్లీ మొదలయిందని, 24 గంటల కరెంటనేది ఎపుడో స్తుందోనని కెటిఆర్ ని కొద్దిగా గిల్లుకున్నాడు. కెటిఆర్ స్పందించారు. ఇదెక్కడిజరుగుతన్నదో చెప్పండని అడిగారు. తెలంగాణాలో ప్రకటిత కరెంటు కోత లు లేవని, @TsspdclCorporat ని కాంటాక్ట్ చేయమన్నారు. తర్వాత@TsspdclCorporat నుంచి జవాబొచ్చింది. ఇప్పడు మీప్రాంతంలో కరెంటుసరఫరా సాగుతూ ఉంది. కరెంటు రాకపోయిఉంటే, ట్విట్ చేయండని కరెంటాఫీస్ చెప్పింది.
ఇలా చకచకా పనులు సాగిపోతున్నాయి. సోషల్ మీడియాని కెటిఆర్ ప్రభుత్వానికి తెలంగాణా ప్రజలకు మధ్య ఒక వారధి మార్చేశారు. ప్రస్తుతం చదువకున్నోళ్లే దీనిని వాడుతున్నారు. పల్లెటూరిరైతుల, నేతగాడు, కూలి కూడా సమీపంలోని ఇ-సేవకు వెళ్లి కెటిఆర్ కు తమ గోడు ట్వీట్ చేసుకునే రోజు తొందర్లోనే రానుంది.