గుజరాత్‌ పారిశ్రామికవేత్తలు అహ్మదాబాద్‌ కంటే హైదరాబాద్‌నే ఇష్టపడుతున్నారు: మంత్రి కేటీఆర్

Published : Apr 05, 2022, 02:01 PM IST
గుజరాత్‌ పారిశ్రామికవేత్తలు అహ్మదాబాద్‌ కంటే హైదరాబాద్‌నే ఇష్టపడుతున్నారు: మంత్రి కేటీఆర్

సారాంశం

హైదరాబాద్ జీనోమ్‌ వ్యాలీలో ఏర్పాటు చేసిన జాంప్‌ ఫార్మాను మంత్రి కేటీఆర్ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జాంప్ ఫార్మా ఆవరణలో మంత్రి కేటీఆర్ మొక్కలు నాటారు.   

గుజరాత్‌ పారిశ్రామికవేత్తలు అహ్మదాబాద్‌ కంటే హైదరాబాద్‌నే ఇష్టపడుతున్నారన్నారని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ జీనోమ్‌ వ్యాలీలో ఏర్పాటు చేసిన జాంప్‌ ఫార్మాను కేటీఆర్ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జాంప్ ఫార్మా ఆవరణలో మంత్రి కేటీఆర్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కెనడా తర్వాత హైదరాబాద్‌లో జాంప్‌ హైదరాబాద్‌లోనే పెద్ద బ్రాంచ్‌ను ప్రారంభించిందని చెప్పారు. తెలంగాణలో రూ. 250 కోట్లతో జాంప్ ఫార్మాను నెలకొల్పడం సంతోషకరంగా ఉందన్నారు. దీనివల్ల 200 మందికి ఉపాధి లభిస్తుందన్నారు. పరోక్షంగా వేలాదిమందికి ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. 

జీనోమ్ వ్యాలీ ఆకర్షణీయమైన పెట్టుబడుల కేంద్రంగా మారిందని కేటీఆర్ అన్నారు. అన్ని రకాలుగా ఫార్మా సంస్థలకు జీనోమ్‌ వ్యాలీ అనువుగా ఉంటుందని.యూనిట్ల స్థాపనకు ఫార్మా కంపెనీలు ముందుకు రావాలన్నారు. సీఎం కేసీఆర్ పరిశ్రమలకు అద్భుతమైన సహకారాన్ని అందిస్తున్నారని చెప్పారు. గ్లోబల్‌ వ్యాక్సిన్‌ ఉత్పత్తుల్లో హైదరాబాద్‌ వాటా 33శాతం ఉందని గుర్తు చేశారు. 50 బిలియన్ డాలర్లుగా ఉన్న జీనోమ్ వ్యాలీ పెట్టుబడులు.. 2030 కల్లా 100 బిలియన్లకు చేరడమే లక్ష్యమని తెలిపారు.

28 రోజుల్లోనే జాంప్‌ ఫార్మాకు భూమిని కేటాయించామన్నారు. ప్రపంచంలోనే అతిపెద్దదైన బీ-హబ్ నిర్మాణాన్ని తెలంగాణ ప్రభుత్వం తలపెట్టిందని తెలిపారు. బీ-హబ్ నిర్మాణంతో పాటు జీనోమ్ వ్యాలీ అభివృద్ధి కొనసాగుతుందని పేర్కొన్నారు. త్వరలో బీ-హబ్‌ను ప్రారంభించి, బయోలాజికల్‌ పరిశోధనలకు తోడ్పాటునందించబోతున్నామని కేటీఆర్‌ ప్రకటించారు.

 గ్లోబల్ వ్యాక్సిన్ ఉత్పత్తుల్లో హైదరాబాద్ వాటా 33 శాతంగా వుందన్నారు. జీనోమ్ వ్యాలీ.. బిజినెస్ హబ్ గా మారబోతోంది. అనేక ప్రతిష్టాత్మక ఫార్మా కంపెనీలు జీనోమ్ వ్యాలీలో ఉన్నాయి. జీనోమ్ వ్యాలీకి అనుసంధానంగా ఏర్పాటు చేయాలని అందుకు కంటోన్మెంట్ ద్వారా స్కైవేల నిర్మాణానికి అనుమతులను అడుగుతున్నాం అన్నారు. 7 ఏళ్లుగా కేంద్రం మా ప్రతిపాదనలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. కేంద్రం బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదు. జీనోమ్ వ్యాలీకి దగ్గరలో 5 స్టార్ హోటల్స్ కూడా రానున్నాయని కేటీఆర్ తెలిపారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

హైదరాబాద్‌లో సంక్రాంతి ఫుడ్ ఫెస్టివల్ | Sankranthi Food Festival Reaction | Asianet News Telugu
Journalists Arrest : జర్నలిస్టులను ఎందుకు అరెస్ట్ చేశారు.. అసలు ఏమిటీ వివాదం..?