వరి ధాన్యం విషయంలో కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకు దిగితే మద్దతిస్తాం : రేవంత్

Published : Apr 05, 2022, 01:59 PM ISTUpdated : Apr 05, 2022, 02:50 PM IST
వరి ధాన్యం విషయంలో కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకు దిగితే మద్దతిస్తాం : రేవంత్

సారాంశం

పార్లమెంట్ సమావేశాలు ముగిసిన తర్వాత ఢిల్లీలో ఆందోళనలు చేసి ఏం చేస్తారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. వరి ధాన్యం కొనుగోలు అంశానికి సంబంధించి బీజేపీ, టీఆర్ఎస్ లు తమ రాజకీయ  ప్రయోజనాల కోసం రైతుల జీవితాలను పణంగా పెడుతున్నారన్నారు.

న్యూఢిల్లీ: పార్లమెంట్ సమావేశాలు ముగిసిన తర్వాత ఢిల్లీలో ఆందోళన చేయడం వల్ల ఏం ఉపయోగమో చెప్పాలని రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎం కేసీఆర్ ను ప్రశ్నించారు.

న్యూఢిల్లీలో మంగళవారం నాడు టీపీసీసీ చీఫ్ Revanth Reddy  మీడియాతో మాట్లాడారు.ఈ నెల 11న ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద టీఆర్ఎస్ ఆందోళన చేస్తే ఏం ఉపయోగమని ఆయన ప్రశ్నించారు.ఈ నెల 8వ తేదీతో పార్లమెంట్ సమావేశాలు ముగుస్తున్నాయన్నారు.

వరి ధాన్యం కొనుగోలు విషయమై  BJP, TRS లు రాజకీయ ప్రయోజనాల కోసం పాకులాడుతున్నాయన్నారు. రైతుల జీవితాలతో ఈ రెండు పార్టీలు చెలగాటమాడుతున్నాయని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. 

Boiled Raice ను తాము ఇవ్వబోమని తెలంగాణ ప్రభుత్వం కేంద్రంతో చేసుకొన్న ఒప్పందం ప్రస్తుతం తెలంగాణ రైతులకు గుదిబండగా మారిందన్నారు. రైతులు పండించిన Paddy ధాన్యానికి కనీస మద్దతు ధర రూ. 1960 కి కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రం నుండి కొనుగోలు చేసిన వడ్లను Raw Rice చేసుకొంటారో బాయిల్డ్ రైస్ చేసుకొంటారో, నూకలు చేసుకొంటారో కేంద్రం ఇష్టమన్నారు.  కానీ ఈ సమస్యను పక్కన పెట్టి టీఆర్ఎస్, బీజేపీలు సమస్యను మరింత జఠిలం చేసే ప్రయత్నాలు చేస్తున్నాయని రేవంత్ రెడ్డి విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం నుండి వరి ధాన్యాన్ని సేకరించాల్సిన బాధ్యత కేంద్రానిదేనని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు.

వరి ధాన్యం కొనుగోలు విషయమై తాము ఆందోళనలకు తాము పిలుపినిస్తే టీఆర్ఎస్ కూడా ఆందోళనలకు పిలుపునిచ్చిందని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఈ నెల 4న తాము మండల కేంద్రాల్లో నిరసనలకు దిగితే అదే రోజు టీఆర్ఎస్ కూడా ఆందోళనలు చేసిందన్నారు. ఈ నెల 6న తాము కలెక్టరేట్ ల ముట్టడికి పిలుపునిస్తే టీఆర్ఎస్ నేతలు జాతీయ రహదారుల దిగ్భందనానికి పిలుపునిచ్చారని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు.ఈ నెల 7న విద్యుత్ సౌధ ముందు తాము ధర్నాలకు పిలుపునిచ్చామన్నారు. 

తెలంగాణ రాష్ట్రానికి చెందిన టీఆర్ఎస్ ఎంపీలు సీఎం నేతృత్వంలో ప్రధానిని కలిసి వరి ధాన్యం కొనుగోలు విషయమై నిలదీయాలని ఆయన డిమాండ్ చేశారు. వరి ధాన్యం కొనుగోలు చేయాలని కోరుతూ కేంద్రం సరిగా స్పందించకపోతే Delhi లోని జంతర్ మంతర్ వద్ద ఆమరణ నిరహార దీక్ష చేయాలని రేవంత్ రెడ్డి కేసీఆర్ కు సూచించారు. జంతర్ మంతర్ వద్ద దీక్ష చేస్తే తాము మద్దతు పలుకుతామన్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

హైదరాబాద్‌లో సంక్రాంతి ఫుడ్ ఫెస్టివల్ | Sankranthi Food Festival Reaction | Asianet News Telugu
Journalists Arrest : జర్నలిస్టులను ఎందుకు అరెస్ట్ చేశారు.. అసలు ఏమిటీ వివాదం..?