బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసు : ఏ క్షణమైనా అఖిలప్రియ భర్త భార్గవ్‌రామ్‌ అరెస్ట్‌..

Published : Jan 12, 2021, 11:45 AM IST
బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసు : ఏ క్షణమైనా అఖిలప్రియ భర్త భార్గవ్‌రామ్‌ అరెస్ట్‌..

సారాంశం

కలకలం సృష్టించిన బోయిన్‌పల్లి కిడ్నాప్‌ కేసులో మాజీ మంత్రి, టీడీపీ నేత భూమా అఖిలప్రియను రెండవరోజు పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. బేగంపేట్ మహిళా పోలీస్ స్టేషన్‌లో ఆమెను బోయినపల్లి పోలీసులు విచారిస్తున్నారు. 

భార్గవ్ రామ్ సహా ఇతర నిందితులు ఎక్కడున్నారు అన్న కోణంలోనూ విచారణ జరగనుంది. అంతేకాకుండా బాధిత కుటంబంతో బలవంతంగా సంతకాలు సేకరించిన పత్రాలు ఎక్కడ ఉన్నాయన్న  కోణంలోనూ పోలీసులు ప్రశ్నల వర్షం కురింపించనున్నారు. 

మరోవైపు ఈ కేసులలో నిందితులు భార్గవ్ రామ్, గుంటూరు శ్రీనుల కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఏ క్షణం అయినా వారిని అరెస్టు చేసే అవకాశం ఉంది. ఇప్పటివరకు బోయినపల్లి కిడ్నాప్‌ కేసులో అఖిలప్రియతో పాటుమొత్తం మరో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. 

ఈ కేసులో మొత్తం 19 మంది ప్రమేయం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. భార్గవ్‌రామ్, గుంటూరు శ్రీనులు పథకం ప్రకారమే కిడ్నాప్ చేసినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఇప్పటికే దీనికి సంబంధించి పలు కీలక ఆధారాలను సేకరించారు. నిందితులు ఉపయోగించిన కార్లు, సెల్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

PREV
click me!

Recommended Stories

Kavitha Comments: వీళ్ళిద్దరికీ కి ఈ బిల్డింగ్ కనిపించడం లేదా? | Jagruthi | Asianet News Telugu
హైదరాబాద్‌లో అంబరాన్నంటిన హోలీ సంబరాలు | BJP Chief RamChander Rao | Asianet News Telugu