చంద్రబాబు వ్యవహారం '' ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే'' అన్నట్లుంది: కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు

By Arun Kumar PFirst Published Mar 5, 2019, 2:27 PM IST
Highlights

ఐటీ చట్టాన్ని ఉల్లంఘించి ఏపీ ప్రజల సమాచారాన్ని తస్కరించినందుకే ఐటీ గ్రిడ్ సంస్థపై తెలంగాణ పోలీసులు చర్యలు తీసుకుంటున్నట్లు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. అందులో తెలంగాణ ప్రభుత్వ ప్రమేయం ఎంతమాత్రం లేదన్నారు.  ఈ వ్యవహారంపై విచారణ జరిగితే తమ డేటా దొంగతనం ఎక్కడ  బయటపడుతుందోనని చంద్రబాబుకు భయం పట్టుకుందని...అందుకోసమే విచారణను అడ్డుకోడానికి ప్రయత్నిస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. 

ఐటీ గ్రిడ్ వ్యవహారంపై  కేటీఆర్ మరోసారి ట్విట్టర్ ద్వారా స్పందించారు. ''మీరు ఏ నేరం చేయకపోతే ఈ ఉలికిపాటు ఎందుకు? తెలంగాణ పోలీసుల విధి నిర్వహణకు ఏపి పోలీసుల అడ్డంకులు ఎందుకు? కోర్టులో తప్పుడు పిటిషన్లు ఎందుకు? విచారణ జరిగితే డేటా దొంగతనం బయటపడుతుంది అనే కదా మీ భయం @ncbn గారూ?'' అంటూ కేటీఆర్ ప్రశ్నించారు. 

మరో ట్వీట్ లో '' పౌరుల వ్యక్తిగత సమాచారాన్ని గోప్యంగా ఉంచాల్సిన ఏపి ప్రభుత్వం ఆ సమాచారాన్ని ఒక ప్రైవేటు కంపెనీకి చేరవేయటం ప్రైవసీ చట్టానికి తూట్లు పొడవటమే. ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే అన్నట్టు ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం మీద ఏడుపులు ఎందుకు @ncbn గారూ?'' అంటూ కేటీఆర్ ఏపి ముఖ్యమంత్రిని ప్రశ్నించారు. 
 
ఇదివరకే కేటీఆర్ ఈ వ్యవహారంతో తమేకేమీ సంబంధం లేదని...హైద్రాబాద్ లో ఉంటున్న లోకేశ్వర్ రెడ్డి అనే వ్యక్తి  ఫిర్యాదు మేరకు తెలంగాణ పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేశారని  వివరించారు.  ఐటీ గ్రిడ్ సంస్థ కార్యాలయం హైద్రాబాద్‌లోనే ఉందని, ఈ సంస్థపై ఫిర్యాదు కూడా ఇక్కడే అందింది కాబట్టి తెలంగాణ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని కేటీఆర్  గుర్తు చేశారు. అయితే ఈ వ్యవహారంలో ఏపీ పోలీసులు తెలంగాణలో పోలీసులను అడ్డుకోవడం సరైందేనా అని ఆయన ప్రశ్నించారు.తెలంగాణలో ఏపీ పోలీసులకు ఏం పని అని కేటీఆర్ ప్రశ్నించారు.

click me!