స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ మనదే గెలుపు, విపక్షాలకి భంగపాటు తప్పదు: కేటీఆర్

By Nagaraju penumalaFirst Published Apr 13, 2019, 8:21 PM IST
Highlights

సోమవారం టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆధ్వర్యంలో జరగబోయే టీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో చర్చించాల్సిన అంశాలపై కూడా చర్చించారు. రాష్ట్రంలోని 32 జిల్లా పరిషత్తుల్లో టీఆర్ఎస్ విజయకేతనం ఎగురవేస్తుందని కేటీఆర్‌ ధీమా వ్యక్తం చేశారు. అలాగే 530కి పైగా మండల పరిషత్తుల్లోనూ గెలుస్తామన్నారు. 

హైదరాబాద్‌: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ విజయదుందుభి మోగించడం ఖాయమని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలపై కేటీఆర్‌ ప్రధాన కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. 

లోక్ సభ పోలింగ్ సరళితోపాటు త్వరలో జరగబోయే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై సమీక్షించారు. లోక్‌సభ పోలింగ్‌ సరళితో పాటు త్వరలో జరగబోయే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై ఆరా తీశారు. 

సోమవారం టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆధ్వర్యంలో జరగబోయే టీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో చర్చించాల్సిన అంశాలపై కూడా చర్చించారు. రాష్ట్రంలోని 32 జిల్లా పరిషత్తుల్లో టీఆర్ఎస్ విజయకేతనం ఎగురవేస్తుందని కేటీఆర్‌ ధీమా వ్యక్తం చేశారు. 

అలాగే 530కి పైగా మండల పరిషత్తుల్లోనూ గెలుస్తామన్నారు. అసెంబ్లీ, లోక్ సభ, పంచాయితీ ఎన్నికల్లో దెబ్బతిన్న కాంగ్రెస్, ఇతర పార్టీలకు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ భంగపాటు తప్పదని స్పష్టం చేశారు. 

స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ పార్టీకే ప్రజలు బ్రహ్మరథం పడతారని కేటీఆర్ స్పష్టం చేశారు. వారం, పది రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చే అవకాశం ఉందని అందుకు పార్టీ శ్రేణులను సన్నద్ధం చెయ్యాలని కేటీఆర్ ఆదేశించారు. 

click me!